English   

నిర్మాతకు ప్రమాదం...అర్ధనగ్న ప్రదర్శన !

shiva rama prasad
2019-09-18 10:33:19

తనకి కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశామంటూ తమకు రోడ్డు వేయకుండా అడ్డు పడుతున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాద్ మీద ఆరోపణలు చేశారు సినీ నిర్మాత పరచూరి ప్రసాద్. వివరాల్లోకి వెళితే షేక్ పేట ఓయూ కాలనీలో ఒక రోడ్డుకి సిమెంట్ రోడ్డు సాంక్షన్ అయ్యింది. అయితే ఆ రోడ్డులోని వారు తనకు వోటు వేయలేదని భావిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యే గత నెలరోజుల నుంచి అధికారులను బెదిరించి అపుతున్నాడని ఆరోపిస్తూ అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు నిర్మాత.  తాను నివసిస్తున్న వీధి అస్తవ్యస్తంగా ఉందని, వర్షం కురిస్తే నీళ్లు నిలిచిపోతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. 

నెల రోజుల క్రితం అధికారులు రోడ్డు వేసే నిమిత్తం కంకర కుప్పలు పోయగా, వాటిలో ఓ కుప్ప కారణంగా సోమవారం నాడు శివరామప్రసాద్ కిందపడిపోయారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. సోమవారం రాత్రి నుంచి నిన్న  మధ్యాహ్నం వరకు ఆయన అక్కడే వుండి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు స్పందించారు. వెంటనే పనులకు శ్రీకారం చుట్టడంతో నిర్మాత దీక్ష విరమించారు.  శివరామ ప్రసాద్ టక్కరి, సింహ, గుండె ఝల్లుమంది,షాడో సినిమాలకి నిర్మాతగా వ్యవహరించారు. 

More Related Stories