English   

సైరా ట్రైలర్ లాంచ్...బాహుబలి తరహాలో

 Sye raa Trailer
2019-09-18 10:50:11

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమా మరో 15 రోజుల్లోనే సినిమా విడుదల కానుంది. నిజానికి ఈరోజు 'సైరా నరసింహారెడ్డి' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగాల్సి ఉంది.ఈరోజు ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ప్లాన్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ సహా, రాజమౌళి, కొరటాల శివ తదితరులు ఈ ఈవెంట్‌కి హాజరు కావల్సి ఉంది. అయితే, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా, ఈ స్టేడియం ఓపెన్‌ స్టేడియం కావడంతో అభిమానులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో ఈ ఈవెంట్‌ని వాయిదా వేశారని చెబుతున్నారు. అయితే ముందుగా అనుకున్నట్టుగానే ఈరోజు 'సైరా నరసింహారెడ్డి' ట్రైలర్‌ విడుదల చేయనున్నారట. 

సోషల్ మీడియాతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో ట్రైలర్ ను సాయంత్రం స్క్రీన్ చేయబోతున్నారు. ఈ అన్ని థియేటర్స్ లోనూ అభిమానులకు ఉచిత ప్రవేశం లభిస్తుందని చెబుతున్నారు. గతంలో బాహుబలికి కూడా ఇలాంటి ట్రైలర్ రిలీజే ప్లాన్ చేశారు. ఇక చిరు, చరణ్, సురేందర్ రెడ్డి మరికొంత మంది టీమ్ ఈరోజు ప్రసాద్ ఐమాక్స్ లో జరిగే ట్రైలర్ లాంచ్ లో పాల్గొననున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ ట్రైలర్ రెండు నిముషాల 55 సెకన్ల దాకా ఉందట. ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, తమన్నా, నిహారికలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి రామ్‌ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

More Related Stories