English   

అల్లు అర్జున్ కి గాయాలు .. అసలేమైంది ..

alluarjun
2019-09-18 19:00:25

మెగా హీరో అల్లు అర్జున్ నాపేరు సూర్య తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో నటిస్తున్న సినిమా అల వైకుంఠపురంలో . ఇప్పటికే చాలా గ్యాప్ రావడంతో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో రెండు సూపర్ హిట్ సినిమాలు రావడంతో ఈ సినిమా ప్రకటించిననాటి నుండే మంచి అంచనాలున్నాయి. ఇక వీరు కూడా ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పై కన్నేశారు. ఇటీవల విడుదల అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేశాయి.
 
అయితే తాజాగా బన్నీ తలకు, చేతికి గాయాలతో ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది చూసిన బన్నీ అభిమానులు బన్నీ కి ఏదో జరిగిపోయిందంటూ రచ్చ మొదలెట్టారు.ఈ పిక్ వలన బన్నీకి గాయాలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అవన్నీ నిజం దెబ్బలు కావని, షూటింగ్ లో ఒక సన్నివేశానికి సంబంధించి బన్నీకి అలా మేకప్ వేశారని అంటున్నారు. ఈ విషయం మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది. 

More Related Stories