చిరంజీవిని ఉరి తీస్తే అభిమానులు ఒప్పుకుంటారా...

అదేంటి.. చిరంజీవిని ఉరి తీయడం ఏంటి అనుకుంటున్నారా..? కానీ ఇదే నిజం..! ఇప్పుడు నిజంగానే చిరంజీవి కోసం ఉరి తీసే ప్లాన్ సిద్దం చేస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. అయితే ఇది రియల్ లైఫ్ కోసం కాదు లెండీ.. రీల్ లైఫ్ కోసం. ఇప్పుడు మెగాస్టార్ దృష్టి మొత్తం సైరా నరసింహారెడ్డి సినిమాపైనే ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అక్టోబర్ 2న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పుడు ట్రైలర్ కూడా విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమాలో ఉయ్యాలవాడ జీవితాన్ని ఉన్నదున్నట్లు తీసినట్లు అర్థమవుతుంది. సైరా నరసింహారెడ్డిలో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార లాంటి స్టార్ క్యాస్ట్ ఇందులో నటిస్తున్నారు. కథ ప్రకారం ఈ చిత్ర క్లైమాక్స్ లో చిరంజీవి చచ్చిపోవాలి. ఆంగ్లేయులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరితీసారు. అంతేకాదు.. ఆయన తలను కోట గుమ్మానికి 30 ఏళ్ల పాటు వేలాడదీసారు. మరి ఇలాంటి పాత్రలో ఇప్పుడు చిరంజీవి నటిస్తున్నాడు. ఆయన మాదిరే చిరును కూడా క్లైమాక్స్ లో ఉరితీస్తారా.. అలా చేస్తే అభిమానులు ఊరుకుంటారా..? ఉరి తీయకపోతే కథకు అన్యాయం చేసినట్లు.. తీస్తే అభిమానులకు నచ్చదేమో అనే భయం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య చిరంజీవి మర్డర్ కోసం సురేందర్ రెడ్డి పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నాడు. ట్రైలర్ లో కూడా చిరంజీవిని ఉరి తీస్తున్నట్లు చూపించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..?