English   

అక్కినేని నాగార్జున పొలంలో మృతదేహం..

Nagarjuna.jpg
2019-09-19 10:57:38

హీరో అక్కినేని నాగార్జునకి చెందిన పొలంలో పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహాం దొరకడం కలకలం రేపుతుంది. షాద్‌నగర్ మండలంలో కేశంపేట్ పరిధిలోని పాపిరెడ్డిగూడలో 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగొలు చేసాడు నాగార్జున. మొన్న సెప్టెంబర్ 10న తన వ్యవసాయ కేత్రంలో భార్య అమలతో కలిసి వెళ్లి చెట్లు కూడా నాటాడు నాగార్జున. ఈ క్రమంలో వ్యవసాయ కేత్రంలో ఆర్గానిక్ పంటలు పండించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. ఇదే విషయంపై వ్యవసాయ సాగు కోసం తన పొలానికి నిపుణులను పంపాడు నాగార్జున. అయితే పొలానికి వెళ్లిన తర్వాత ఆ ఫామ్ హౌస్ లోని ఒక గదిలో కుళ్లిపోయిన మృతదేహాన్ని ఆ  నిపుణులు గుర్తించారు. 

 

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు నిపుణులు. కుళ్లిపోయిన మృతదేహానికి అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. ఆ శవం దొరికిన గదిని సీజ్ చేయగా ఈరోజు అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించనున్నారు. అసలు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరనే విషయంపై కూడా ఆరా తీయనున్నారు పోలీసులు. ఆ వ్యక్తి ఎవరు..? ఎప్పుడు మరణించాడు..? ఎవరు చంపారు..? అన్న కోణంలో దర్యాప్తును ప్రారంభించారు పోలీసులు. అయితే గతేడాది జూలైలో ఇదే ఫాంహౌస్‌లో ఎలక్ట్రిక్ షాక్‌కు గురై దంపతులు మృతి చెందిన విషయం తెలిసిందే.

More Related Stories