English   

చిరంజీవి బయోపిక్...

Chiranjeevibiopic.jpg
2019-09-19 11:09:11

తమిళ బ్లాక్ బస్టర్ జిగర్తాండ సినిమాని తెలుగులో వాల్మీకి పేరుతో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రేపు రిలీజ్ చేయనున్నారు. హైదరాబాద్ లో జరిగిన వాల్మీకి ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ పలు ఆసక్తికర సంగతుల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వరుణ్ కి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ లో అవకాశం వస్తే నటిస్తారా? అని. దానికి వరుణ్ అయితే ఎగిరి గంతేశాడు. తాను తప్పకుండా నటిస్తానని అయితే మొదటి ఆప్షన్ మాత్రం అన్న రామ్ చరణ్. 

ఆ తర్వాత తాను నటించే వీలుందని వరుణ్ చెప్పుకొచ్చాడు. హరీష్ శంకర్ ఇప్పటికే చిరంజీవి బయోపిక్ ప్లాన్ చేస్తున్నాడని, అందులో తనకు మాత్రం వేషం ఇవ్వడానికి హరీష్ ఇష్టపడడం లేదని వరుణ్ చెప్పుకొచ్చాడు. "హరీష్ మైండ్ లో చిరంజీవి బయోపిక్ ఉంది. ఎప్పటికైనా బయోపిక్ చేస్తానంటున్నాడు. కానీ నాతో మాత్రం చేయనంటున్నాడు. నిజానికి చిరంజీవి బయోపిక్ చేయడానికి రామ్ చరణ్ మాత్రమే అర్హుడు. చరణ్ అన్న చేయనంటే మాత్రం నేను రెడీ." అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

More Related Stories