English   

రావణాసురుడిగా ప్రభాస్...నిజమేనా

 Prabhas
2019-09-19 12:28:46

బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ హీరోగా మారిపోయాడు ప్రభాస్. ఈ టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్ మొన్ననే  'సాహో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ వ్యయంతో ఎన్నో అంచానాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తేడాపడింది. కలెక్షన్ల పరంగా బాగానే ఉన్నా అభిమానులను మెప్పించే విషయంలో పూర్తిగా విఫలం అయ్యింది. అయితే ప్రస్తుతం ప్రభాస్ జాన్ అనే సినిమా చేస్తున్నాడు, ఈ సినిమా తర్వాత ప్రభాస్ తన తదుపరి సినిమాలో రావణాసురుడుగా కనిపించనున్నాడనే టాక్ మొదలయింది. అందుతున్న సమాచారం ప్రకారం రామాయణ కథతో ప్రముఖ దర్శకుడు నితేశ్‌ తివారీ తెరకెక్కించబోతున్నారు. ఈ ప్రాజెక్టును 600 కోట్ల వ్యయంతో మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారట. 

ఇందులో బలమైన రావణుడి పాత్ర కోసం ప్రభాస్‌ను యూనిట్ సంప్రదించినట్టు సమాచారం. అయితే, ఇప్పటివరకు ప్రభాస్‌ ఈ సినిమాకు ఓకే చేయలేదని అంటున్నారు, ఇక ఈ సినిమాలో సీత పాత్రను దీపికా పదుకొనె చేయనున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాని ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఏకకాలంలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారని అంటున్నారు. రాముడిగా హృతిక్‌ రోషన్‌ నటించే అవకాశముండటంతో అతనికి  ధీటుగా రావణుడి పాత్రలో ప్రభాస్‌ అలరించే అవకాశముంటని బాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సినిమా కోసం క్యాస్టింగ్‌ ఫైనల్‌ చేయలేదని ఈ వార్తలను దర్శకుడు నితేశ్‌ కొట్టిపారేశారు. బహుశా వీలయినంత త్వరలోనే క్యాస్టింగ్ ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.       

More Related Stories