English   

సమంత నిర్మాతలతో సంపత్ నందితో గోపీచంద్ సినిమా.. 

Gopichand
2019-09-19 12:40:07

ఒకసారి పని చేసిన దర్శకులతో మళ్లీ మళ్లీ పని చేస్తుంటాడు గోపీచంద్. హిట్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా వాళ్లకు మరో ఆఫర్ ఇస్తుంటాడు గోపీ. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈయన. ప్రస్తుతం ఈయన చాణక్య సినిమాతో బిజీగా ఉన్నాడు. దసరాకు ఈ చిత్రం విడుదల కానుంది. తమిళ దర్శకుడు తిరు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. చాణక్య తర్వాత గోపీచంద్ చేయబోయే సినిమాపై అభిమానుల్లో ఆసక్తి కనిపిస్తుంది. దీనికి ఇప్పుడు సమాధానం వచ్చేసింది. ఈయన సంపత్ నందితో సినిమా చేయబోతున్నాడు. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నందా సినిమా డిజాస్టర్ అయిపోయింది. ఈ చిత్రంలో గోపీచంద్ హీరో కమ్ విలన్ గా నటించాడు. ఇప్పుడు మరోసారి డిఫెరెంట్ కథతో రాబోతున్నారు ఈ కాంబో. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించబోతున్నారు. గతంలో సమంత అక్కినేని నటించిన యు టర్న్ సినిమాను వీళ్లే నిర్మించారు. ఇప్పుడు గోపీచంద్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ నిర్మాతలు. మొత్తానికి అప్పుడు ఫ్లాప్ ఇచ్చిన సంపత్ నంది.. ఇప్పుడు హిట్ ఇచ్చి బాకీ తీర్చుకుంటాడో లేదో చూడాలి.
 

More Related Stories