English   

లేడీ డైరెక్టర్‌తో నాగశౌర్య కొత్త సినిమా.. 

Naga Shourya
2019-09-19 14:05:03

ఛలో సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో నాగశౌర్య. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. మొన్నొచ్చిన ఓ బేబీ మంచి విజయం సాధించినా కూడా అందులో నాగశౌర్య హీరో కాదు.. జస్ట్ ప్రత్యేక పాత్రలో నటించాడంతే. ఇప్పుడు ఈయన హీరోగా రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో సినిమాకు కూడా ముహూర్తం పెట్టాడు శౌర్య. తాజాగా ఈయన లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రాబోతుంది. వరసగా నితిన్, శర్వానంద్, నాని లాంటి హీరోలతో సినిమాలు నిర్మిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు నాగశౌర్య సినిమాకు ముహూర్తం పెట్టింది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 

More Related Stories