English   

బందోబస్త్ ప్రివ్యూ.. సూర్య హిట్ కొడతాడా కొట్టడా..

 Bandobast
2019-09-19 14:21:37

సూర్యకు ఒకప్పుడు మంచి మార్కెట్ ఉండేది. డిఫెరెంట్ సినిమాలు చేస్తాడనే పేరు కూడా ఉండేది. కానీ కొన్ని సినిమాలతో ఆయన ఇమేజ్ మొత్తం పోయింది. అసలు కొన్నేళ్లుగా సూర్య సినిమాలు ఎప్పుడొచ్చి వెళ్లిపోతున్నాయో కూడా ప్రేక్షకులకు అర్థం కావడం లేదు. ఆయన నటిస్తున్న సినిమాలపై అంచనాలు కూడా తగ్గిపోతున్నాయి. మొన్నటికి మొన్న సెల్వరాఘవన్ తెరకెక్కించిన ఎన్ జి కే సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన సంగతి కూడా ప్రేక్షకులకు తెలియదు అంటే సూర్య ఇమేజ్ ఎలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఆయన కేవీ ఆనంద్ దర్శకత్వంలో బందోబస్త్ సినిమాతో వస్తున్నాడు. నిజంగానే ఈ సినిమా బందోబస్త్‌గా ఉంది. మోస్ట్ కమర్షియల్ ఎలిమెంట్ అయిన ఇండియా పాకిస్తాన్ టెర్రరిజం అంశాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాడు దర్శకుడు కె.వి.ఆనంద్. ఇదివరకే ఈయన కాంబినేషన్లో సూర్య నటించిన అయన్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత బ్రదర్స్ అంచనాలు అందుకోకపోయినా విభిన్న ప్రయత్నంగా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు బందోబస్తు సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు ఈ జంట. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసాయి. విజువల్ గ్రాండియర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు కె.వి.ఆనంద్. ఇందులో సూర్యతో పాటు మోహన్ లాల్, ఆర్య, సయేషా సైగల్ కీలక పాత్రల్లో నటించారు. టెర్రరిజం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మాయ చేస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. సెప్టెంబర్ 20న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల వరకు బిజినెస్ చేసింది. మరి చూడాలిక.. ఈ మార్క్ ను సూర్య అందుకుంటాడో లేదో..? 

More Related Stories