సైరా నరసింహారెడ్డిని టెన్షన్ పెడుతున్న ఆ సెంటిమెంట్..

సైరా నరసింహారెడ్డి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీతో పాటు ఇండియాను ఊపేస్తోన్న పేరు ఇది. దీనికి కారణం మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఈ చిత్రం చేస్తున్నాడు కాబట్టే దీనికి ఇంతగా క్రేజ్ వచ్చింది. బాహుబలి రేంజ్ లో ఉయ్యాలవాడ ప్రాజెక్ట్ చేస్తున్నాడు చిరంజీవి. దీనికోసం 250 కోట్లు ఖర్చు చేసాడు రామ్ చరణ్. ఆ కల కోసమే ప్రాణం పెట్టి కష్టపడ్డాడు మెగాస్టార్. రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా సంచలనాలు రేపుతుంది. విడుదలైన క్షణం నుంచి కూడా రచ్చ చేస్తుంది సైరా ట్రైలర్. అన్ని భాషల్లోనూ దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పని చేసారు. ఉయ్యాలవాడ కోసం ఎంత కష్టపడుతున్నా.. ఒక్క సెంటిమెంట్ మాత్రం చిత్రయూనిట్ ను బాగా భయపెడుతుంది. అదే స్టార్ హీరోలకు దేశభక్తుల కారెక్టర్స్ అచ్చిరాకపోవడం. బాలయ్య ఒక్క మగాడు అంటూ డిజాస్టర్ ఇచ్చాడు.. వెంకటేశ్ సుభాష్ చంద్రబోస్ గా నిరాశపరిచాడు.. నాగార్జున రాజన్నగా ప్రశంసల దగ్గరే ఆగిపోయాడు. బాలీవుడ్ లోనూ అమీర్ ఖాన్ మంగళ్ పాండేగా ఫ్లాపయ్యాడు.. అజయ్ దేవ్ గన్ కూడా చంద్రశేఖర్ ఆజాద్ మెప్పించలేకపోయాడు. ఒక్క కమల్ మాత్రమే భారతీయుడుగా.. ఎన్టీఆర్ సర్దార్ పాపారాయుడిగా మెప్పించారు. చిరంజీవి ఇప్పుడు దేశభక్తుడి పాత్రలో నటిస్తున్నాడు. మరి ఈయనకు కాలం ఎలా కలిసిరానుందో..?