English   

నాగార్జున పొలంలో ఆస్థిపంజరం ఎవరిదంటే  

 Dead body
2019-09-20 12:13:41

నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఫాం హౌస్ లో కుళ్లిపోయిన మృతదేహం లభించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. గతంలో కూడా అక్కడ ఇద్దరు సెక్యూరిటీ వారు చనిపోవడంతో రకరకాల ఊహాగానాలు, పుకార్లు మొదలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మృతదేహం ఎవరిదో కనిపెట్టే పనిలో పడ్డారు. తాజాగా బయటపడ్డ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే అంతకంటే ముందే ఆ మృతదేహం ఎవరిదో గుర్తించారు. మృతదేహం మీదున్న బట్టలు, వస్తువులు ఆధారంగా అది ఆ ఊరికే చెందిన ఒక వ్యక్తిదని గుర్తించారు. ఆ మృతదేహం నాలుగేళ్లుగా కనిపించకుండా పోయిన పాపిరెడ్డిగూడకు చెందిన పాండు (32)ది అని తేలింది. అక్కడే అతడు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. 

అందుతున్న సమాచారం ప్రకారం చిన్న అంజయ్య-జంగమ్మ దంపతుల నలుగురు సంతానంలో పాండు చిన్నవాడు. మూడో అన్న కుమార్‌ తో పాండుకు ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. అయితే కుమార్‌ కిడ్నీ వ్యాదితో మృతిచెందిన నాటి నుంచి పాండు బాగా కుంగిపోయాడు.  అనంతరం చనిపోతున్నానంటూ ఓ లేఖ రాసి చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత పాండు కోసం కుటుంబసభ్యులు చాలాచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. అయితే అతడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడంతో విషయం మరుగున పడిపోయింది. ఇప్పుడు ఈ మృతదేహం బయటపడడం, ఆ జేబులో ఆధార్‌ కార్డు కార్డు ఆధారంగా మృతుడిని పాండుగా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

More Related Stories