English   

పీటర్‌ హెయిన్స్‌ కి హీరో దొరికేశాడా  

 Peter Hein
2019-09-20 12:34:28

పీటర్‌ హెయిన్స్‌ తెలుగు సహా దక్షినాది బాషల సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. గౌతమ్‌ మీనన్‌ 'చెలి'తో ఫైట్‌ మాస్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో 'మురారి'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'అపరిచితుడు', 'శివాజీ', 'గజిని', 'మగధీర', 'రోబో', 'బాహుబలి', 'మన్యం పులి' ఇలా కెరీర్‌ ప్రారంభించిన కొన్నాళ్లలోనే సౌత్‌ ఇండియాతో పాటు, బాలీవుడ్‌ సినిమాలకు స్టంట్ మాస్టర్ గా మారారు. ఆయన మెగాఫోన్‌ పట్టుకుంటారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకి మొన్న నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్‌ బ్యానర్ మీద సినిమా చేస్తున్నామని ప్రకటించారు. హీరో, హీరోయిన్‌తో పాటు ఇతర ఆర్టిస్టులను ఇంకా ఎంపిక చేయాలని ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అప్పుడు చెప్పుకొచ్చారు. 

అయితే ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ను అనుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఆఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఉంటుందని అంటున్నారు. స్వతహాగా ఫైట్ మాస్టర్ కావడంతో ఈ సినిమాలో కూడా యాక్షన్ భారీగా ఉండేలా పీటర్ భావిస్తున్నారట. ఇక ప్రస్తుతం  శంకర్ మరియు కమల్ హాసన్ కలయికలో వస్తున్న భారతీయుడు 2 సినిమా కి ఫైట్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. ఈ సినిమా ఒక కొలిక్కి వచ్చాక పూర్తి స్థాయిలో సినిమా మొదలు పెడతారని అంటున్నారు.

More Related Stories