English   

గద్దలకొండ గణేష్ మూవీ రివ్యూ

valmiki
2019-09-20 13:26:42

వరుణ్ తేజ్.. హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన వాల్మీకి సినిమా 'గద్దలకొండ గణేష్' గా ఈరోజు ప్రపంచవ్యప్తంగా విడుదలయ్యింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమాలో తమిళ నటుడు అధర్వ  కీలక పాత్ర పోషించారు. తమిళ సూపర్ హిట్ సినిమా జిగార్తాండ రీమేక్ కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి నుండి వాల్మీకి పేరుతో ప్రచారం అయిన ఈ సినిమా టైటిల్‌ను మార్చాలంటూ బోయ, వాల్మీకి సంఘాలు ఆందోళనకు చేయడం, దీంతో కర్నూలు, అనంతపురం జిల్లాల కలెక్టర్స్ సినిమా విడుదల ఆపాలని ఆదేశించడంతో దర్శక, నిర్మాతలు అప్పటికప్పుడు వాల్మీకి సినిమా టైటిల్‌ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు. అయితే మరి ఈ సినిమా ఆశించిన మేర ఫలితాలు అందుకుందా ? ఈ సినిమా అంచనాలను ఏమేరకు అందుకుంది అనేది రివ్యూలో చూద్దాం.

కథ:

అభి (అథర్వ మురళి) దర్శకుడు కావాలని కలలు కంటుంటాడు. ఎన్నో కధలు రాసుకున్నా వర్కౌట్ కావు. అయితే దర్శకుడు కావాలంటే ఒక గ్యాంగ్ స్టర్ కథతో రమ్మని ఒక నిర్మాత కోరడంతో నిజ జీవితంలో గ్యాంగ్ స్టర్ అయిన గడ్డలకొండ గణేష్ (వరుణ్ తేజ్)ను దగ్గరుండి పరిశీలించి ఆయన కథే రాసుకుని సినిమా కధగా మలచాలనుకుంటాడు. ఈ క్రమంలో అభి గణేష్ దగ్గర ఎలా చేరాడు ? అనుకున్నట్లు కథ రాశాడా? గద్దలకొండ గణేష్ ఎందుకు గ్యాంగ్ స్టర్ గా మారాడు? అదే ఈ సినిమా కధ.

కథనం :

తమిళంలో బంపర్ హిట్ అయిన జిగర్తాండా సినిమాను తెలుగులోకి మక్కీకి మక్కీ దింపేయకుండా వరుణ్ పాత్రకు మరో ఫ్లాష్ బ్యాక్ కూడా రాసుకున్నాడు దర్శకుడు. ఒరిజినల్ సినిమాలోని కొన్ని సీన్లను కట్ చేయలేకపోవడంతో సినిమా దాదాపు 3 గంటల రన్ టైం ki చేరింది. టాలీవుడ్ లో వరుణ్ తేజ్ ఒక సినిమాకి మరొక సినిమాకి సంబంధం లేకుండా తను ఎంచుకుంటున్న సినిమాలు ఆయన్ని ఒక సెపరేట్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. ఇక ee సినిమాలో పాత్ర కోసం తనను తాను మౌల్డ్ చేసుకున్న విధానం బాగుంది. హరీష్ శంకర్ ప్రధాన బలం ఎంటర్టైన్మెంట్. ఆ విషయంలో ఈ సినిమా ఎక్కడా నిరాశపరచదు. సినిమా మొదలైన కాసేపటికే మనల్ని ఎంగేజ్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా సాగిపోతుంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్ లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. సెకండ్ హాఫ్ పై మరిన్ని అంచనాలు ఏర్పడేలా చేస్తాయి. 

అయితే సెకండ్ హాఫ్ లో కధ తడబడింది. ఒరిజినల్ లో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను చేసాడు హరీష్, అదే దెబ్బేసింది.యాడ్ చేసాడు. ఈ ఎపిసోడ్ బాలేదనీ అన్నలేము అలాగని సూపరని అనిపించదు. కానీ అఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎల్లువొచ్చి గోదారమ్మ పాట మాస్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తుంది. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వల్ల గద్దలకొండ పాత్ర సోల్ దెబ్బతిందని చెప్పాలి. ఒకరకముగా చెప్పాలంటే తమిళ మాతృక చూడని వారికి సినిమా ఎంగేజింగ్ గా ఉంటుంది.. ఆ సినిమా చూసిన వారు మాత్రం పెదవి విరిచే అవకాశం ఉంది. 

నటీనటులు :

వరుణ్ తేజ్ కి ఇది కెరీర్ లో బెస్ట్ రోల్ అని చెప్పవచ్చు. తన ఆహార్యం, డైలాగ్ డెలివరీ ఇలా అన్నిట్లో ఆకట్టుకున్నాడు. సినిమాకి మెయిన్ అట్రాక్షన్ వరుణే, విలన్ షేడ్స్ ఉన్న పాత్ర అంటూనే హీరో రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడు దర్శకుడు. తమిళ నటుడు అధర్వ మురళి కూడా బాగా నటించాడు. కానీ హేమచంద్ర డబ్బింగ్ అధర్వకి సూట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. పూజ హెగ్డే, మృణాళిని రవిలు ఇద్దరూ ఉన్నంతలో బాగానే నటించారు. ఇక మిగతా పాత్రలలో బ్రహ్మాజీ, సత్య తనికెళ్ళ భరణి పాత్రలు బాగున్నాయి. మిగతా వారుతమ తమ పరిధుల మేర నటించారు.

ఫైనల్ గా : ఇది గద్దలకొండ గణేష్ వన్ మ్యాన్ షో...డోంట్ మిస్ ఇట్...

రేటింగ్ :  3/5

More Related Stories