English   

నిఖిల్ అర్జున్ సురవరం రిలీజ్ అవుతుందా

 Nikhil
2019-09-20 16:10:38

యంగ్ హీరో నిఖిల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమా టి.సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే నిజానికి నిఖిల్ కి ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత సరైన హిట్ పడ లేదు. ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని టైం తీసుకొని మరీ ముద్ర అనే సినిమా చేశాడు. ఫస్ట్ లుక్, టైటిల్ లోగో ఒక టీజర్ కూడా రిలీజ్ చేసిన ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందో తెలీదు. నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించనున్న ఈ సినిమా ముందు ముద్ర అనుకున్నా ఆ తర్వాత టైటిల్ కి సంబందించిన వివాదాలు ఎదురయ్యాయి, దాంతో ముద్ర కాస్త అర్జున్ సురవరంగా మారింది. 

అయితే నిజానికి ముందుగా చెప్పిన టైం ప్రకారం అయితే అర్జున్ సురవరం సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ అది గత ఆరు నెలలుగా వాయిదా పడుతూ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. త్వరలో విడుదల తేదీని చెప్తామని అర్జున్ సురవరం టీమ్ చెబుతోంది. సాహో సినిమా తర్వాత సినిమా ఉంటుందని నిఖిల్ చెప్పినా ఇప్పుడు సైరా తరువాత కూడా ఉండదని చెబుతున్నారు.  ప్రస్తుతం నిఖిల్ చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ - 2 ' సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ రెండో వారం నుండి మొదలెట్టనున్నారని అంటున్నారు.  

More Related Stories