English   

క్లైమాక్స్ షూట్ లో దర్బార్  

Rajinikanth Darbar
2019-09-20 16:19:50

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ద‌ర్బార్‌`. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ మీద శుభస్క‌ర‌న్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పూణేలో షూట్ జ‌రుపుకుంటోంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను ముంబయిలో షూట్ చేయగా ఇప్పుడు మూడో షెడ్యూల్‌ను పుణెలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్‌కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ షెడ్యూల్ కోసమే రజనీకాంత్‌ పుణె చేరుకున్నారు. 

ఈ మూడో షెడ్యూల్‌ కూడా పూర్తయితే ఇక కేవలం సాంగ్స్ పార్ట్ మాత్రమే ఉంటుందని అంటున్నారు. టాకీ పార్ట్ అంతా మూడో షెడ్యూల్ లో పూర్తయితే వెంటనే సాంగ్స్ షూట్ కోసం విదేశాలకి సినిమా యూనిట్ అంతా తరలి వెళ్లనున్నట్టు  చెబుతున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్‌ పోలీసు అధికారిగా నటిస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన వివరాలను మరింత గోప్యంగా ఉంచుతున్నారు. న‌య‌న‌తార‌, నివేదా థామ‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమాలో తాజాగా రజనీ సెకండ్ లుక్ ని రిలీజ్ చేశారు. ప‌క్కా మాస్ లుక్‌లో సై అంటే సై అనేలా ర‌జ‌నీ గెట‌ప్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

More Related Stories