English   

బ్యాక్ టూ అర్జున్ రెడ్డి.. వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ లుక్..

World Famous Lover
2019-09-20 17:39:44

మనం ఎక్కడ్నుంచి వచ్చామో ఆ మూలాలను అస్సలు మరిచిపోకూడదు. ఇప్పుడు విజయ్ దేవరకొండను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈయన నటిస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత ఈయన చేస్తున్న సినిమా ఇది. క్రాంతిమాధ‌వ్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైందిప్పుడు. వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ చేతిలో సిగరెట్ పట్టుకుని మొహంలో ఫ్రస్టేషన్ చూపిస్తున్నాడు విజయ్. ఇది సేమ్ టూ సేమ్ మళ్లీ అర్జున్ రెడ్డిని చూస్తున్నట్లే అనిపిస్తుంది. బ్యాక్ టూ పెవిలియన్ అన్నట్లుంది ఇప్పుడు విజయ్ పరిస్థితి. లుక్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది కూడా. ఇప్పుడు దీన్ని విడుదల చేసారు. ఓనమాలు తర్వాత మళ్లీ మళ్లీ ఇది రానిరోజు లాంటి సినిమా చేసిన క్రాంతి.. ఉంగ‌రాల రాంబాబుతో డిజాస్ట‌ర్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు విజ‌య్ ఉన్న పొజిష‌న్ ప్ల‌స్ క్రేజ్ ను క్రాంతి ఎంత‌వ‌ర‌కు హ్యాండిల్ చేస్తాడు అనేది అంద‌ర్లోనూ ఉన్న అనుమానం. అయితే ఇక్క‌డ మ‌రో అడ్వాంటేజ్ కూడా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ద‌ర్శ‌కుల‌ను రెస్పెక్ట్ చేయ‌డం బాగా తెలుసు. క‌థ డిమాండ్ చేస్తే కాళ్లు ప‌ట్టుకోడానికి కూడా సిద్ధంగానే ఉంటాడు ఈ హీరో. గీత‌ గోవిందంలో కూడా ఇదే చేస్తాడు విజ‌య్. హీరో వ‌ర్షిప్ కంటే కూడా న‌టుడిగా ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌తాడు విజ‌య్. క్రాంతి సినిమాలో కూడా ఇదే ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, కేథరిన్ థ్రెసా, ఎజిబెల్లా, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అందుకే సినిమాకు వలర్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ పెట్టారు. క్రియేటివ్ కమర్షియల్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More Related Stories