English   

గద్దలకొండగణేష్‌కి సూపర్‌హిట్‌ కలెక్షన్స్‌

GaddalakondaGanesh.jpg
2019-09-21 07:40:46

సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా గద్దలకొండగణేష్‌ విడుదలయ్యి మొదటి షో నుండే పాజిటివ్‌ టాక్‌తో సూపర్‌హిట్‌ కలెక్షన్స్‌ సాధిస్తోంది. ఈ సందర్భంగా మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ - ''నిన్న రాత్రి మా ఎవ్వరికి నిదరపట్టలేదు. ఎప్పుడైతే ప్రీమియర్‌ షోస్‌ పడ్డాయో అప్పటినుండి పాజిటివ్‌టాక్‌తో మాకు నిద్రపట్టకుండా చేశారు. మార్నింగ్‌ చిరంజీవి గారు, అల్లు అరవింద్‌ గారు ఫోన్‌ చేసి అభినందించారు. అప్పటి నుండి కంటిన్యూయస్‌గా కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. ఇది నా ఒక్కడి విజయం కాదు మా టీం అందరి విజయం. సినిమా స్టార్టింగ్‌ నుండి సపోర్ట్‌ చేసి, ఇప్పుడు పాజిటివ్‌ రివ్యూస్‌ ఇచ్చిన మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు'' అన్నారు

గద్దల కొండ గణేష్‌' సినిమా విడుదలయినప్పటి నుండి అందరి నోటా ఒకటే మాట సూపర్‌హిట్‌ అని. వరుణ్‌తేజ్‌ వన్‌మాన్‌షో అని హై ఎనర్జీతో మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీ నుండి కూడా మంచి అప్రిసియేషన్‌ వస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవిగారు ఫోన్‌ చేయడంతో మాకు ఇంకాఎనర్జీ వచ్చింది. తరువాత అల్లుఅర్జున్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. కొంతమంది అయితే హరీష్‌.. నీకెరీర్‌ బెస్ట్‌వర్క్‌ అన్నారు. బహుశా ఫస్ట్‌ టైం నాసినిమాలో ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఎమోషన్‌ కూడా బాగా పండింది. మా సినిమాకి ఇంత ప్రేమ వస్తుంది అని మేము అనుకోలేదు. ఎవరు ఓడిపోయారో నాకు తెలీదు కానీ సినిమా మాత్రం గెలిచింది'' అన్నారు డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ 

More Related Stories