English   

సైరా మీద నెగటివ్ ప్రచారం మొదలెట్టిన తమిళ మీడియా

SyeRaa-Narsimha-Reddy.jpg
2019-09-21 10:18:40

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ హీరో సుదీప్ తదితరులు కీలక పాత్రలలో నటించిన సినిమా సైరా నరసింహారెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా మీద టాలీవుడ్ సహా మరికొన్ని భాషల్లోని ప్రేక్షకుల్లోనూ విపరీతమైన అంచనాలు ఉన్నాయి.  అయితే తొలి తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీయబడిన ఈ కథ ఒక్క తెలుగువారికి తప్ప మరే భాషకు సంబంధించిన ప్రాంతం వారూ అడ్పాట్ చేసుకోలేరని అంటున్నారు. అయితే తమ వాళ్లనే అమితంగా ఇష్టపడే తమిళ వాళ్ళు అయితే అసలు ఎలా కనెక్ట్ అవుతారు అంటూ తమిళ మీడియా ప్రశ్నిస్తోంది.

మెగా స్టార్ చిరంజీవికి తెలుగువారిలో ఫాలోయింగ్ ఉన్నా తమిళనాడులో చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ అంతంత మాత్రమే అని అక్కడి మీడియా కధనాలు ప్రసారం చేస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే చిరంజీవి తెలివిగా ఈ మూవీ కోలీవుడ్ కలక్షన్స్ కోసం విజయ్ సేతుపతిని నయనతారను ఈ మూవీలో కీలక పాత్రలు ఇప్పించి వారి ఇమేజ్ ద్వారా 'సైరా'ను తమిళనాట మార్కెట్ చేయబోతున్నారని అక్కడి మీడియా కధనం. ప్రస్తుతం విజయ్ సేతుపతికి కోలీవుడ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపధ్యంలో అతని క్రేజ్ తో 'సైరా' ను ఇక్కడ పాపులర్ చేయడం కోసమే అంటూ అక్కడి మీడియా కామెంట్ చేసినట్టు చెబుతున్నారు. ఈ మూవీకి తమిళనాడులో ఓకవేళ మంచి ఓపెనింగ్స్ వస్తే అది విజయ్ సేతుపతి నయనతారల వల్ల జరుగుతుంది కానీ చిరంజీవి మ్యానియాతో ఈ మూవీకి తమిళనాడులో కలక్షన్స్ రావని అక్కడి మీడియా ప్రచారం మొదలెట్టింది.

More Related Stories