English   

చిక్కుల్లో మోహ‌న్ లాల్ ...ఏడేళ్ళ జైలు శిక్ష

mohanlal.jpg
2019-09-21 14:04:38

మళయాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ మళ్ళీ చిక్కుల్లో ప‌డ్డారు. ఎప్పుడో ఏడేళ్ళ క్రితం కేసు ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే 2012లో మోహన్ లాల్ తన ఇంట అక్రమంగా ఏనుగు దంతపు కళాఖండాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎర్నాకుళంలోని కోర్టులో ఆయన మీద చార్జిషీట్ దాఖలైంది. అయితే తాను కె కృష్ణన్‌ అయ్యర్‌ అనే వ్యక్తి నుంచి 65 వేల రూపాయలకు వీటిని కొనుగోలు చేశానని మోహన్‌లాల్ గ‌తంలో క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఆ వివాదానికి సంబంధించి కోర్టు తాజాగా వాదనలు విన్నది. ఈ క్రమంలో ఏనుగు దంతపు కళాఖండాలను ఉంచుకునేందుకు మోహన్‌లాల్‌కు సరైన అనుమతి లేదని  కేర‌ళ ప్ర‌భుత్వం కోర్టుకు తేల్చి చెప్పింది. 

ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నుండి ఈయన ఎలాంటి అనుమతి తీసుకోలేదని కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో కేస్ మళ్లీ మొదటికి వచ్చినట్టయ్యిది. అయితే వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 39 (3) ప్రకారం  మోహన్‌లాల్‌ చేసిన నేరం రుజువు చేయొచ్చని హైకోర్టు తేల్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిజానికి అప్పట్లో మోహన్ లాల్ ఇంట్లో సోదాలు చేసినపుడు కూడా ఐటీ అధికారులు ఆ దంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఈ కేసు అనేక సంచలనాలకి కారణం అయ్యింది. ఈ కేసులో మోహన్‌లాల్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసారు అటవీ శాఖ అధికారులు. కేసు నిజం అని తేలితే మోహ‌న్‌లాల్‌కి ఏడేళ్ళ జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

More Related Stories