English   

శివప్రసాద్ కన్నుమూత.. సంతాపం తెలిపిన టాలీవుడ్..

naramalli sivaprasad Dead
2019-09-21 14:51:15

తెలుగుదేశం మాజీ ఎంపీ, ప్రముఖ సినీనటుడు శివప్రసాద్ కన్నుమూసారు. ఈయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శివప్రసాద్ మరణంపై కుటుంబం కూడా ధృవీకరించింది. సెప్టెంబర్ 21, మధ్యాహ్నం 2.10 నిమిషాలకు చనిపోయినట్లు వైద్యులు కూడా కన్ఫర్మ్ చేసారు. ముఖ్యంగా ఈయన చనిపోయారంటూ ఒకరోజు ముందుగానే ఇలా వార్తలు వచ్చాయి. కానీ అది అబద్ధమని చెప్పిన తర్వాత ఒకరోజులోనే ఆయన చనిపోవడం విషాదం. రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించిన శివప్రసాద్.. సినిమాల్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ముందు చిన్న సినిమాల్లో చిన్న వేషాలతో అలరించాడు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘మాస్టారి కాపురం’ సినిమా శివప్రసాద్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. 15 ఏళ్ల కింద కృష్ణవంశీ తెరకెక్కించిన ‘డేంజర్’ సినిమాలో విలన్‌గా మెప్పించి నంది అవార్డు అందుకున్నారు. నితిన్ హీరోగా వచ్చిన ఆటాడిస్తా సినిమాలో నన్ను కొట్లే అనే డైలాగ్‌తో ఫేమస్ అయ్యాడు శివప్రసాద్. నాని హీరోగా వచ్చిన పిల్ల జమీందార్ సినిమాలో లాయర్ పాత్రలో నటించాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా తెలుగులో ‘ఇల్లాలు’, రోజా హీరోయిన్‌గా పరిచయమైన ‘ప్రేమ తపస్సు’, ఆ తర్వాత ‘టోపీరాజా స్వీటి రోజా’ ‘కొక్కోరకో’ వంటి పలు సినిమాలను కూడా డైరెక్ట్ చేసాడు. ఆయనకు ఒక భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 2009, 2014లో తెలుగుదేశం నుంచి ఎంపీగా ఉన్నాడు శివప్రసాద్.

More Related Stories