English   

గద్దలకొండ గణేష్ ఫస్ట్ డే కలెక్షన్స్.. వరుణ్ తేజ్ అరాచకం..

Varun Tej
2019-09-21 16:42:33

వివాదమో.. విషాదమో తెలియదు కానీ 'వాల్మీకీ' సినిమా మాత్రం టైటిల్‌ మార్చుకుని వచ్చిన తర్వాత రచ్చ చేస్తుంది. ముఖ్యంగా ముందు నుంచి కాంట్రవర్సీల్లో ఉండటం.. విడుదలకు ముందు అంచనాలు ఈ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్ తీసుకొచ్చాయి. తొలి రోజు గద్దలకొండ గణేష్ 5.5 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఏపీ తెలంగాణల్లో హౌజ్ ఫుల్ బోర్డులతో రప్ఫాడిస్తున్నాడు వాల్మీకి. ముఖ్యంగా వరుణ్ తేజ్ మాస్ యాక్షన్ అభిమానులకు బాగా ఎక్కేసింది. దాంతో యావరేజ్ టాక్ వచ్చినా.. ఒరిజినల్ ను చెడగొట్టాడనే టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల విషయంలో మాత్రం సంచలనాలు రేపుతుంది. హరీష్ శంకర్ కూడా దీన్ని కాస్త సొంత కథను జోడించి తెరకెక్కించాడు. ఉన్నదున్నట్లు కాకుండా సొంతంగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. జిగర్తాండ సినిమాలోని మెయిన్ థీమ్ వదిలేసి వరుణ్ తేజ్ ఇమేజ్ కోసం కథను మార్చేసాడు. అక్కడే కాస్త తేడా కొట్టింది అయినా కూడా మాస్ ఆడియన్స్ కు ఎక్కే అంశాలు చాలానే ఉండటంతో ఇప్పుడు వాల్మీకి పాస్ అయిపోయేలా కనిపిస్తున్నాడు. రెండో రోజు కూడా సినిమా మంచి వసూళ్లు తీసుకొచ్చేలా కనిపిస్తుంది. 25 కోట్ల లక్ష్యంతో వచ్చిన వాల్మీకి కచ్చితంగా మూడు నాలుగు రోజుల్లోనే అంతా తీసుకొచ్చి.. తొలివారంలో లాభాల్లోకి వచ్చేలా కనిపిస్తున్నాడు. రెండు వారాల వరకు సినిమాలు లేకపోవడం కూడా గద్దలకొండ గణేష్ సినిమాకు కలిసొచ్చే అంశం.
 

More Related Stories