English   

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆన్‌లైన్ టికెట్స్ బంద్..

talasani
2019-09-21 17:11:31

తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి ఓ నిర్ణయం తీసుకున్నాడు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. తెలంగాణలో ఇకపై ఆన్ లైన్ టికెట్ అమ్మకాలు ఉండవని ఆయన క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి వివరణ ఇస్తామని చెప్పాడు. ఆన్ లైట్ టికెట్స్ అమ్మకాలు తెలంగాణలో రద్దు చేస్తామంటూ అనౌన్స్ చేసారు ఈయన. దీనివల్ల నిర్మాతలకు నష్టం జరుగుతుందని.. దాని స్థానంలో ప్రభుత్వమే టికెట్స్ అమ్మకాలు చేసేలా ఏర్పాటు చేస్తామని చెప్పాడు మంత్రి తలసాని. దానివల్ల నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా నష్టాలు తగ్గుతాయని.. లాభాలు వస్తాయంటున్నాడు ఈయన. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందని గుర్తు చేస్తున్నాడు తలసాని. 18 నుంచి 20 లైన్స్.. 8 నుంచి 10 లైన్స్ సిట్టింగ్స్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నాడు మంత్రి తలసాని. ఇలా చేస్తే ఇండస్ట్రీకి కూడా ఆదాయం పెరుగుతుందని.. పూర్తిగా టికెట్ల అమ్మకాలు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చినట్లు అవుతుందని చెబుతున్నాడు ఈయన. మరి మంత్రిగారు చెప్పిన లైన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

More Related Stories