English   

అన్న ఫంక్షన్‌కు తమ్ముడు.. సైరా వేడుకలో పవన్ కల్యాణ్..

Pawan Kalyan
2019-09-21 17:45:44

ఈ మధ్య కాలంలో అన్నాదమ్ముల మధ్య మెలో డ్రామా బాగా పెరిగిపోతుంది. నీకునేను నాకునువ్వు అన్నట్లు ఉంటున్నారు చిరంజీవి, పవన్ కల్యాణ్. ప్రతీ చిన్న విషయం కూడా కలిసే చర్చిస్తున్నారు. ముఖ్యంగా అన్నకు అన్ని వేళలా తోడుగా కనిపిస్తున్నాడు తమ్ముడు. ఇప్పుడు సినిమాల విషయంలో కూడా. ప్రస్తుతం చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ రాబోతున్నాడు. సెప్టెంబర్ 22న ఎల్బీ స్టేడియంలో భారీగా ఈ వేడుక జరగబోతుంది. దీనికోసం బాబాయ్ దగ్గరికి నిర్మాత రామ్ చరణ్ స్వయంగా వెళ్లి మరీ ఆహ్వానం అందిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కూడా పెంచేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో అందర్లోనూ ఆసక్తి కనిపిస్తుంది. ట్రైలర్ కూడా అదిరిపోవడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. పైగా సినిమాలో పవన్ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చాడని.. అది థియేటర్స్ లో కూడా వినిపిస్తుందని చరణ్ చెప్పడం మరింత ఆసక్తి పెంచేస్తుంది. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగానే జరగబోతుంది. ఇందులో చిరంజీవితో పాటు పవన్ కల్యాణ్ కూడా ఒకే వేదికను షేర్ చేసుకోబోతున్నాడు. ఇదే వేడుకలో మెగా హీరోలంతా కలిసి కనిపించబోతున్నారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, బన్నీ సహా అంతా రాబోతున్నారు. దానికితోడు సినిమాలో నటించిన మిగిలిన వాళ్లు.. మెగా హీరోలు కూడా రానున్నారు. అమితాబ్ బచ్చన్ మాత్రం ఇక్కడికి రావడం లేదని తెలుస్తుంది. ఎందుకో తెలియదు కానీ కొన్ని రోజులుగా ఈ చిత్రం ప్రమోషన్స్ కు దూరంగానే ఉంటూ వస్తున్నాడు అమితాబ్ బచ్చన్.

More Related Stories