English   

ఆస్కార్ ఎంట్రీ లిస్టులో  విజయ్ దేవరకొండ సినిమా!

Dear Comrade
2019-09-21 18:11:03

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌. ఈ ఏడాది జులై నెల 26వ తేదీన రిలీజయిన ఈ సినిమా మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టుగా ఈ సినిమా ఎందుకు ఆడలేదు అంటే చెప్పడం కష్టమే. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్, బిగ్ బెన్ రెండూ నిర్మాణ సంస్థలు ఈ సినిమాని నిర్మించాయి.  రన్ టైం మొదలు కధ సాగతీత దాకా అనేక కారణాలు ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోడానికి కారణం అయ్యాయి. భారీ అంచనాలతో నాలుగు బాషలలో రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని విధంగా అన్ని బాషలలో డిజాస్టర్ అయింది.

అయితే ఇప్పుడు అనూహ్యంగా డియర్ కామ్రేడ్ సినిమా ఫిలిమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపికైందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ చిత్రంతో పాటు మ‌రో 28 చిత్రాల‌ను  ఈ లిస్టులోకి ఎంపిక‌య్యాయి. ఈ చిత్రాల‌న్నింటినీ స్క్రీనింగ్ చేసి వాటిలో మంచి చిత్రాన్ని ఎంపిక చేసి ఓ చిత్రాన్ని బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్  కేట‌గిరీలో ఆస్కార్‌కి పంపుతారని చెబుతున్నారు. ఈ లిస్టులోకి ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌ ఒక్కటే అని చెబుతున్నారు. ప్రస్తుతం ఎంపికయిన 28 సినిమాల స్క్రీనింగ్ జ‌రుగుతోంది. వీటిలో బెస్ట్ మూవీని ఆస్కార్ ఎంట్రీకి పంపిస్తారు. 

More Related Stories