English   

భానుప్రియకు అరెస్ట్ ఒక్కటే శరణ్యమా.. కేసులో సీనియర్ హీరోయిన్..

Banupriya
2019-09-21 18:47:00

భానుప్రియ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది. సౌత్ ఆడియన్స్ అందరికీ భానుప్రియ ఇమేజ్ తెలుసు. అయితే ఇప్పుడు ఈమె మెడ చుట్టూ చైల్డ్ లేబర్ కేస్ చుట్టుకుంది. పోలీసు కేసులు అంటూ నానా రచ్చ జరుగుతుంది. 2018 జనవరిలో ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో భానుప్రియపై బాలకార్మికుల నేరం నమోదైంది. ఇదే ఇప్పుడు ఇష్యూ మరింత సీరియస్ అయింది. చివరికి ఆమె అరెస్ట్ వరకు కూడా మ్యాటర్ వెళ్లేలా కనిపిస్తుంది. ఈ కేస్ తొలి ఫిర్యాదు చెన్నైలో నమోదవడంతో కేసును అక్కడికి ట్రాన్స్ ఫర్ చేసారు పోలీసులు. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం భానుప్రియపై 323, 506,341 సెక్షన్లతో పాటు 75, 79 జువైనల్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదయ్యాయి. పాండిబజార్ పోలీసుల ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. ప్రస్తుతం చెన్నైలోనే ఉంటుంది భానుప్రియ. 2018 జనవరి 19న తన ఇంట్లో పని చేసే అమ్మాయి దొంగతనం చేసిందంటూ సోదరుడు గోపికృష్ణతో కలిసి పాండిబజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ సీనియర్ నటి. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ ఉంది. దొంగతనం చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పనమ్మాయి తల్లి ప్రభావతి.. భానుప్రియపై గతంలోనే సామర్లకోట పోలీస్ స్టేషన్ కేసు పెట్టడం ట్విస్ట్. తన కూతుర్ని బలవంతంగా ఇంట్లో నిర్భంధించి చిత్రహింసలు పెడుతున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. తన కూతుర్ని ఆ చెర నుంచి విడిపించాలని ఆమె కోరింది. దాంతో ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదును పరిగనణలోకి తీసుకున్న పోలీసులు భానుప్రియపై బాల కార్మికుల నేరం నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసునే సామర్లకోట పోలీసులు చెన్నైకి బదిలీ చేసారు. అదే సమయంలో భానుప్రియ పెట్టిన కేసులో చెన్నై, పాండిబజార్‌ పోలీసులు పనిపిల్ల, తల్లి ప్రభావతిని దొంగతనం కేసులో అరెస్ట్‌ చేసి విచారించారు. 2018లో నమోదైన ఈ కేసును సామర్లకోట పోలీసులు ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించిన నేరం జరిగింది చెన్నైలో కాబట్టి నటి భానుప్రియపై బాల కార్మికుల చట్టం కింద వారు నమోదు చేసిన కేసును చెన్నై పోలీసులకు ఇటీవల తరలించారు. ఇప్పుడు కేస్ సీరియస్ కావడంతో ఏ క్షణంలోనైనా బాలకార్మిక చట్టం కింద చిన్నపిల్లతో పని చేయించినందుకు భానుప్రియను ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Related Stories