English   

బాలీవుడ్ లో సైరాపై కుట్ర.. థియేటర్స్ ఇవ్వకుండా ఆటలు..

sye raa
2019-09-22 07:35:13

దాదాపు పాతికేళ్ళ తర్వాత మళ్లీ బాలీవుడ్ పై దృష్టి పెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హిందీలో కూడా భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైంది సైరా నరసింహారెడ్డి. ఇలాంటి సమయంలో చిరంజీవిని ఇద్దరు బాలీవుడ్ హీరోలు టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురుకానుంది. అక్టోబర్ 2న బాలీవుడ్లో మరో భారీ సినిమా కూడా విడుదల అవుతుంది. అదే వార్.. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన ఈ సినిమాను సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంది. యాక్షన్ ప్రియులకు ఈ సినిమా పండగ. కచ్చితంగా ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించాలని కసి మీద కనిపిస్తున్నాడు హృతిక్. ఈయన సినిమాలు కొన్నేళ్లుగా కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోవడం లేదు. అయినా కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు హృతిక్ రోషన్. ఇక వార్ సినిమా సైరా విడుదల కానున్న అక్టోబర్ 2నే రానుండటంతో చిరంజీవికి షాక్ తప్పేలా లేదు. ఇంకో విషయం ఏంటంటే యశ్ రాజ్ ఫిల్మ్స్ వార్ సినిమా కోసం ఎక్కువ స్క్రీన్స్ బుక్ చేసుకున్నారు. తమ సినిమాను వీలైనంత భారీగా విడుదల చేయబోతున్నామంటూ అనౌన్స్ చేసారు కూడా. దాంతో సైరాకు స్క్రీన్స్ తక్కువగా రాబోతున్నాయి. ఎంతైనా సైరా డబ్బింగ్ సినిమా. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లాంటి హీరోల ముందు చిరు సినిమా ఎంతవరకు నిలబడుతుందనేది ఆసక్తికరంగా మారింది. కచ్చితంగా ఈ రెండు సినిమాలు ఎదురుపడితే సైరాకు కాస్త నష్టం తప్పదు. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే తప్ప బాలీవుడ్ లో చిరంజీవి సినిమాకు ఊహించిన కలెక్షన్లు రావడం కష్టం. మరి ఈ వార్ ఎలా ఉండబోతుందో చూడాలి.

More Related Stories