English   

దుమ్ములేపుతున్న దిమాక్ ఖరాబ్

Dimaak Kharab
2019-09-22 07:42:31

ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో నిధి అగర్వాల్‌, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ ఏడాది జూలై 18న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ మాత్రమే కాక మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. ఆడియన్స్‌తో థియేటర్ లో డాన్సులు వేయించిన సినిమా ఇది. రామ్ కెరీర్‌లో మొదటిసారి 40 కోట్ల షేర్‌కు చేరువగా వెళ్ళిన సినిమా ఇది. సినిమా వచ్చి ఇన్ని రోజులవుతున్నా ఈ సినిమా నుండి వీడియో సాంగ్స్ విడుదల చేయలేదని అభిమానులు గోల చేస్తూనే ఉన్నారు.

 ఇప్పుడు వారి కోరిక మేరకు నిన్న దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ విడుదలైంది. నిధి అగర్వాల్, నభా నటాషా అందాల ఆరబోత, రామ్ సూపర్ డ్యాన్స్ తో ఈ పాట సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా నిన్న విడుదలైనప్పటి నుండి యూ ట్యూబ్‌లో సంచలనాలు రేపుతోంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ దుమ్ము దులుపుతోంది. పక్కా మాస్ మసాలా స్టైల్‌లో స్వరబ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేసిన బీట్‌కి తగ్గట్టు, రామ్ ఎనర్జిటిక్‌ గా వేసిన స్టెప్స్‌కి థియేటర్స్‌ లో అరుపులు పుట్టించాయి.

More Related Stories