English   

ఉయ్యాలవాడ కుటుంబంలో మొదలైన చిచ్చు.. రెండు చీలిక..

SyeRaa-Narasimha-Reddy.jpg
2019-09-22 14:12:37

అవును.. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు ఉయ్యాలవాడ కుటుంబం రెండుగా చీలిపోయింది. సైరా నరసింహా రెడ్డి సినిమా సందర్భంగా ఇది బయటికి వస్తుంది. వాళ్లలో వాళ్లకే క్లారిటీ లేక.. కన్ఫ్యూజన్ తో మీడియా ముందు తమ గొడవలు తామే బయటపెట్టుకుంటున్నారు. ఓ వర్గం అంతా తమను చిరంజీవి మోసం చేసాడని చెబుతుంటే.. మరో వర్గం మాత్రం అసలు తమకు చిరంజీవి డబ్బులిస్తానని చెప్పుడూ చెప్పలేదు.. తమ వంశీకుడు సినిమా చేయడమే గొప్ప అంటున్నారు.

ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి తమ ఊళ్లో పెట్టబోతున్న ఉయ్యాలవాడ విగ్రహావిష్కరణకు చిరంజీవిని ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. ఇదే ఇప్పుడు సంచలనంగా మారుతుంది. అంతేకాదు.. ఆ వేడుకలో ఉయ్యాలవాడ కుటుంబంలోని కొందరు సభ్యులు చిరంజీవిని ప్రత్యేకంగా సన్మానించబోతున్నారు. ఇదే విషయాన్ని ఉయ్యాలవాడ కుటుంబంలోని కొందరు సభ్యులు ప్రకటించారు కూడా. కావాలనే తమ కుటుంబం గురించి కొందరు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని.. రాజకీయ లాభాల కోసమే ఇలా వాళ్లను వాడుకుంటున్నారని కొందరు చెప్పడం సంచలనంగా మారుతుంది.

చిరంజీవిని ఒక్క రోజు కూడా డబ్బు ఇవ్వాలని అడగలేదని.. అసలు సైరా నరసింహా రెడ్డి సినిమా వల్ల తమ కుటుంబానికి నష్టం లేదని.. ఇంకా తమ వంశస్తుడి గురించి అంతా గొప్పగా మాట్లాడుకోవడం తమకు గర్వంగా ఉందంటున్నారు వాళ్లు. ఈ మాటలు బట్టి చూస్తుంటే కచ్చింతగా కేసుల వెనక ఎవరో ఉన్నారని అర్థమవుతుంది. మరి చూడాలిక.. సైరా గొడవలు ఎలా ఉండబోతున్నాయో..?

More Related Stories