English   

సైరా ప్రీ రిలీజ్ వేడుకలో ఆ ముగ్గురు టాప్ డైరెక్టర్స్ అతిథులు..

SyeRaa-Narasimha-Reddy.jpg
2019-09-22 15:05:03

చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుక భారీగా జరగబోతుంది. సెప్టెంబర్ 22న ఎల్బీ స్టేడియంలో ఈ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక దీనికి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ వస్తున్నాడు. ఈయనతో పాటు మరో ముగ్గురు టాప్ దర్శకులు కూడా వస్తున్నారు. వాళ్లే కొరటాల శివ, రాజమౌళి, వినాయక్. చిరంజీవి తన తర్వాతి సినిమా కొరటాలతో చేస్తున్నాడు.. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు.. ఇక చిరంజీవి 150వ సినిమాను వినాయక్ తెరకెక్కించి మెగాభిమానులకు మంచి కానుక ఇచ్చాడు. అందుకే ఈ ముగ్గురు దర్శకులతో ఈవెంట్ ముస్తాబవుతుంది. దానికితోడు పవన్ కల్యాణ్ ఎలాగూ ఉంటాడు. వీళ్లందరి దగ్గరికి నిర్మాత రామ్ చరణ్ స్వయంగా వెళ్లి మరీ ఆహ్వానం అందించాడని ప్రచారం జరుగుతుంది. సైరా సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కూడా పెంచేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో అందర్లోనూ ఆసక్తి కనిపిస్తుంది. ట్రైలర్ కూడా అదిరిపోవడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. పైగా సినిమాలో పవన్ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చాడని.. అది థియేటర్స్ లో కూడా వినిపిస్తుందని చరణ్ చెప్పడం మరింత ఆసక్తి పెంచేస్తుంది.

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగానే జరగబోతుంది. ఈ వేడుకలో మెగా హీరోలంతా కలిసి కనిపించబోతున్నారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, బన్నీ సహా అంతా రాబోతున్నారు. దానికితోడు సినిమాలో నటించిన మిగిలిన వాళ్లు.. మెగా హీరోలు కూడా రానున్నారు. అమితాబ్ బచ్చన్ మాత్రం ఇక్కడికి రావడం లేదు. ఎందుకో తెలియదు కానీ కొన్ని రోజులుగా ఈ చిత్రం ప్రమోషన్స్ కు దూరంగానే ఉంటూ వస్తున్నాడు అమితాబ్ బచ్చన్. ఈయన ముంబైలో సెప్టెంబర్ 27న జరగబోయే ఈవెంట్ లో కనిపించబోతున్నాడు.

More Related Stories