సైరా ప్రీ రిలీజ్...అతిధులు ఎవరంటే ?

తెలుగు తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ మీద రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా అంతే భారీగా నిర్వహించాలని సినిమా యూనిట్ భావించింది. అయితే నిజానికి ఈ నెల 18న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేశారు.
అదే రోజు సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయాలనుకున్నారు. అయితే చివరి నిముషంలో వాయిదా పడిన ఆ కార్యక్రమం ఈరోజు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, వి.వి. వినాయక్ హాజరు కానున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా హాజరు కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నారని చిత్రబృందం పేర్కొంది. ఇక ఈరోజు ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ రానున్నాడని అంటున్నారు.
ఇప్పటికే రామ్ చరణ్ స్వయానా వెళ్లి బాబాయ్ కి ప్రత్యేక ఆహ్వానం అందించాడని అంటున్నారు. ఇక ఈ వేడుకకి మెగా కుటుంబ సభ్యులు అంతా హాజరు కాబోతున్నారని సమాచారం. వరుణ్ తేజ్, బన్నీ, సాయి తేజ్, శిరీష్ మొదలగు హీరోలంతా ఈ వేడుకకు వస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ ని వినాయక్ హోస్ట్ చేయనున్నాడు. ఇక అమితాబ్ బచ్చన్ మినహా ఈ సినిమాలో నటించిన వాళ్ళంతా ప్రీ రిలీజ్ వేడుకలో కనిపించబోతున్నారని అంటున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ వేడుకకు రానుందని చెబుతున్నారు.