అన్నయ్య చిరంజీవి సాక్షిగా పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం..

వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. చిరంజీవి సమక్షంలోనే సైరా రిలీజ్ వేడుక సాక్షిగా పవన్ కళ్యాణ్ కు ఘోరమైన అవమానం జరిగింది. ఎల్.బి.స్టేడియంలో సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా చేశాడు నిర్మాత రామ్ చరణ్. దేనికి మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్, సాయి తేజ్, వరుణ్ తేజ్ వచ్చారు. ఎంతమంది వచ్చినా కూడా ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడం మాత్రం అభిమానులకు చాలా సంతోషాన్ని తీసుకువచ్చింది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ తనదైన ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయనకు ఘోర అవమానం ఎదురైంది. అక్కడి వరకు అంతా బాగానే ఉన్నా పవన్ ప్రసంగం మెదలెట్టగానే ఈ కార్యక్రమాన్ని లైవ్ ఇస్తున్న సాక్షి టీవి కట్ చేసి పవన్ కు షాక్ ఇచ్చింది.
ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ బాగా టార్గెట్ చేస్తున్నాడు. ప్రతి విషయంలోనూ ఆయన చేసే తప్పులను ఎత్తి చూపిస్తున్నాడు. ఇది ఇప్పుడు వైసీపీకి అసలు నచ్చడం లేదు. అందుకే పవన్ ప్రసంగం వస్తున్నప్పుడు సాక్షి టీవీలో లైవ్ ఆపేశారు. అసలు ఏరికోరి టీవీ 9, ఎన్టీవితో పోటి పడి మరీ ప్రసార హక్కులను దక్కించుకున్న సాక్షి చివరికి ఇలా చెయ్యడంతో మెగా అభిమానులు మండి పడుతున్నారు. రాజకీయాలలో పవన్ చరిష్మాను ఓర్వలేకనే జగన్ తన టీవీలో పవర్ స్టార్ లైవ్ ను కట్ చేయించారని సోషల్ మీడియాలో గోలగోల చేస్తున్నారు పవన్ అభిమానులు. మరి ఈ విషయాన్ని అటు మెగాభిమానులు ఇటు సైరా యూనిట్ ఎలా తీసుకుంటారో చూడాలి.