English   

‘సైరా నరసింహారెడ్డి’ సెన్సార్ టాక్...రచ్చ మొదలే

SyeRaa-NarasimhaReddy-Censor.jpg
2019-09-23 18:24:16

మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందిదంటేనే తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. అలాంటిది చాలా గ్యాప్ తీసుకుని మరీ చిరు కలలు కన్న సబ్జెక్ట్ చేయడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు తొలి తరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ చరిత్రను సైరా నరసింహారెడ్డి పేరుతో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.  మామూలుగా సినిమాలకి చివరి నిముషాల్లో సెన్సార్ చేయిస్తారు కానీ ఈ సినిమాలో టెన్షన్ తీసుకోకూడదని ఈరోజే సెన్సార్ చేయించేశారు. ఈ సినిమా మొత్తాన్ని చూసిన U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. అమితాబ్ బచ్చన్, నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించనుండగా, నయనతార, నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా తమన్నా లక్ష్మీగా నటించారు.

వీరారెడ్డిగా జగపతిబాబు, అవుకు రాజుగా 'కిచ్చా' సుదీప్, రాజా పాండిగా విజయ్ సేతుపతి, బసిరెడ్డిగా రవి కిషన్ కనిపించనున్న ఈ సినిమా చూసిన సెన్సార్ టీమ్ యూనిట్ ని అభినందించినట్టు సమాచారం. ఈ సినిమా 2 గంటల 44 నిముషాల నిడివితో ఉందని అంటున్నారు. ఇక సినిమా చూసిన సెన్సార్ టీమ్ సినిమాలోని ఎమోషన్ సీన్స్, వాటి తరువాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. సెన్సార్ టాక్ ప్రకారం సైరా బ్లాక్ బస్టర్ పక్కా అనే ప్రచారం సాగుతుంది. ఇక గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో 'సైరా'  భారీగా విడుదల కానుంది.

More Related Stories