English   

తెలుగు రాష్ట్రలలో దుమ్ము రేపుతున్న ....గద్దలకొండ గణేష్

Gaddalakonda-Ganeah-Censor.jpg
2019-09-23 18:50:35

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమా తెలుగులో దుమ్ము లేపుతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత అదే రేంజ్ లో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. తమిళ్ కల్ట్ సినిమా జిగర్తాండకు తనదైన శైలిలో హరీష్ శంకర్ చేసిన మార్పులకు తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. అందుకే తొలి వారాంతం అంటే మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. బాక్స్ ఆఫీస్ సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి వారాంతంలో ఒక్క తెలుగు రాష్ట్రాల నుండే 13 కోట్లను వసూళ్లు సాధించింది.

25 కోట్ల బిజినెస్ జరిగిన ఈ సినిమాకు ఇది మంచి కలెక్షన్లే అని చెప్పాలి. ఇక ఈ వారం కూడా పెద్దదా సినిమాలు ఏవీ విడుదల కావట్లేదు కాబట్టి సైరా వచ్చేవరకూ ఈ చిత్రానికి కలెక్షన్స్ పరంగా ఎదురు లేదనే చెప్పాలి. ఇక పని దినాల్లో  గణేష్ ఎలా పర్ఫార్మ్ చేస్తాడన్న దాని మీద ఈ సినిమా కలెక్షన్స్ ఆధార పడి ఉంది. సైరాకు ఇంకా 10 రోజుల సమయం ఉంది కాబట్టి దీన్ని వాడుకోవడం చాలా అవసరం. అలాగే యూఎస్ లో కూడా ఈ సినిమా వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నట్లు రిపోర్ట్స్చెబుతున్నాయి. సినిమాలో అనేక మైనస్సులు ఉన్నప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే ఉండడంతో ఈ సినిమా గట్టేక్కినట్టే .

More Related Stories