English   

జాగ్రత్త పడుతున్న ప్రభాస్...అందుకే చెక్కేశాడా

prabhas
2019-09-24 07:01:24

బాహుబలి లాంటి బంపర్ హిట్ అది కూడా ప్యాన్ ఇండియన్ మూవీ వచ్చాక ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆయన నుండి సినిమా వస్తుంది అనగానే భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. ఆ క్రమంలో ఆయన నుండి వచ్చిన భారీ బడ్జెట్ మూవీ సాహో. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో దర్శకుడు సుజీత్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 30న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. 

చిత్రంలో కేవలం భారీ విజువల్ ఎఫెక్ట్స్ , గ్రాఫిక్స్ కి ఇచ్చిన ప్రాధాన్యత కథ, కథనాలకు ఇవ్వలేదనే వాదన విపరీతంగా ప్రచారం అయింది. అయితే బాహుబలి దెబ్బకి ప్రభాస్‌కు వరల్డ్ వైడ్‌గా ఏర్పడిన ఫ్యాన్ బేస్ సినిమాకు ప్లస్ కావడంతో మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ నేపధ్యంలో కాస్త భారీ రెస్ట్ తీసుకుని తన తదుపరి ప్రాజెక్టుపై పూర్తిగా దృష్టి పెట్టాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడట. ఈ క్రమంలో ప్రభాస్ యూరప్ ట్రిప్ కి వెళ్ళాడని అంటున్నారు. 

తాజాగా ప్రభాస్ మొన్న ఆదివారం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనపడ్డారు. ఇందుకు సంభందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. యూరప్‌లో రెండు నెలల పాటు రిలాక్స్ అయి వచ్చే నెలలో ఇండియాకి తిరిగొస్తాడట. నిజానికి సాహో సినిమా మధ్యలో ఉండగాన్ ప్రభాస్ జిల్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఒక రొమాంటిక్ సినిమా మొదలుపెట్టాడు. ఇప్పటికే ఇటలీలో 30 రోజుల పాటు షూటింగ్ కూడా జరిగింది. అయితే సాహో దెబ్బకి ఈ సినిమా స్క్రిప్ విషయంలో కూడా ప్రభాస్ జాగ్రత్త పడుతున్నడని అంటున్నారు. దర్శకుడికి స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు కూడా భారీగానే సూచించాడట ప్రభాస్. వచ్చే ఏడాది ఆగస్ట్‌కి ఈ సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. చూడాలి మరి ప్రభస్ ఇంతలా జాగ్రత్త పడుతున్నాడు మరి ఆ మేరకు ఫలితం అందుతుందో లేదో ?

More Related Stories