English   

ఆర్ఆర్ఆర్ టీమ్ షాకిస్తుందా...వాయిదా తప్పదా

rrr
2019-09-24 08:16:21

ఆర్ఆర్ఆర్‌ కు కూడా బాహుబలి దెబ్బ తప్పేలా కనిపించడం లేదు. అదేంటి ఆర్ఆర్ఆర్ కి బాహుబలికి సంబందం ఏమిటి అనుకుంటున్నారా ? తప్పకుండా బాహుబలి 2 లేట్ అయినట్టే ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే దానికి కారణం కూడా పెద్ద కారణం ఏమీ కాదు. ఎప్పుడూ జరిగే షూటింగ్ డిలేనే. షూట్ డిలే కావడం వలన బాహుబలికి ఏమి జరిగిందో మళ్లీ అదే ఆర్ఆర్ఆర్కు జరగనుంది. బాహుబలి2 మాదిరి ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడే అవకాశం వుంది. 

ఈ సినిమా షూటింగ్ నవంబర్‌ 2018 లో  మొదలుకాగా... మొదటి షెడ్యూల్ పూర్తయిన వెంటనే సినిమాను 2020 జులై 30న విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తయితే సినిమా అదే రోజు థియేటర్స్‌లోకి వచ్చేదేమో. అయితే రెండో షెడ్యూల్ మొదలైందో లేదో రామ్‌చరణ్‌ కాలికి ఎన్టీఆర్ చేతికి గాయం కారణంగా రెండు నెలలపాటు షూటింగ్‌కు నోచుకోలేదు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతోందని హడావుడిగా షూట్ చేసే రకం కాదు రాజమౌళి. తనకు నచ్చేవరకు తీస్తూనే వుంటాడు. 

అందులోనూ ఈ మల్టీస్టారర్ మూవీలో గ్రాఫిక్ వర్క్ ఎక్కువేనట. ఈ విజువల్ ఎఫెక్ట్స్ అనేవి దర్శకుడి చేతిలో వుండదు. గ్రాఫిక్ వర్క్ ఎప్పుడూ అనుకున్న టైంలో ఇవ్వరు. బాహుబలి2 సాహో లాంటి పెద్ద సినిమాలు కూడా కేవలం విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆలస్యం కారణంగా వాయిదా పడ్డాయి. బాహుబలి, సాహోల మాదిరే ఆర్ఆర్ఆర్  కూడా సౌత్‌లోని అన్ని బాషలతో పాటు.. హిందీలో రిలీజ్ అవుతోంది. ఈ మోస్ట్‌ అవేటింగ్ మూవీ జులై 30 రిలీజ్ అవుతుందని తెలిసి మరీ.. "బూల్ బులాయియా2' మూవీని అదే రోజు రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. 

అంటే ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడుతుందని బాలీవుడ్ వర్గాల వారికి నమ్మకం అన్నమాట. అందుకే బూల్ బులాయియా2ను జులై 30న రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ జులై 30న మిస్ అయితే 2020 దసరాకు వస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే సమ్మర్‌ తర్వాత దసరా వరకు సినిమాలకు అన్‌ సీజనే. ఒకటీ అర సెలవులు ఆర్ఆర్ఆర్కు సరిపోవు. 350కోట్ల బడ్జెట్‌ దాదాపు 500 కోట్ల బిజినెస్‌ జరుపుకునే ఆర్ఆర్ఆర్ను అన్ సీజన్లో రిలీజ్ చేయడం కంటే దసరాకు వస్తే భారీ వసూళ్లు కొట్టగొట్టచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్ కోసం మళ్ళీ దసరా వరకూ ఎదురు చూడక తప్పదన్నమాట.

More Related Stories