English   

స్పోర్ట్స్ డ్రామాగా వెంకటేష్ - తరుణ్ భాస్కర్ ల సినిమా

venkatesh-Tarunbhaskar.jpg
2019-09-24 09:01:01

హీరో వెంకటేష్ ఆయన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యలు కలసి మామా అల్లుళ్ళుగా నటిస్తున్న సినిమా వెంకీ మామ. జై లవకుశ ఫేమ్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా పాయల్ రాజ్ పుత్,  నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటించనున్నారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రంలో వెంకీ రైస్ మిల్ ఓనర్ గా, చైతు ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా లైన్ లో ఉండగానే వెంకటేష్ మరో రెండు సినిమాలు ఓకే చేసినట్టు వార్తలు వచ్చాయి. అందులో ఒకటి త్రినాద్ రావు నక్కినతో కాగా మరొకటి పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ తో సినిమా. రెండో సినిమా ఈ నగరానికి ఏమయ్యింది కమర్షియల్ గా ఫెయిల్ కావడంతో కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఈ యువ దర్శకుడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కోసం ఓ కథ రెడీ చేస్తున్నాడట. కథ ఓకే అయ్యింది అయితే పక్కాగా స్క్రిప్ట్ వచ్చాక మాత్రమే మరోసారి చూసుకొని అప్పుడు సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు భావిస్తున్నారట. ప్రస్తుతం దాస్యం తరుణ్ భాస్కర్ పక్కా స్క్రిప్ట్ రూపొందించే పనిలో ఉన్నాడని ఇన్ సైడ్ సమాచారం.

అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందట. అది ఏ ఆట అనే విషయం మీద క్లారిటీ రాకున్నా ఈ సినిమా షూటింగ్ మాత్రం హైదరాబాద్ రేస్ క్లబ్ లో చేయనున్నారని అంటున్నారు. దీంతో ఈ సినిమా హార్స్ రేసుల నేపథ్యంలో ఉండనుందా ? అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. స్పోర్ట్స్ బేస్డ్ సినిమాల్లో నటించడం వెంకీకి కొత్తేమీ కాదు. ‘ఎఫ్ 2’ కు ముందు వెంకీ నటించిన ‘గురు’ బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమానే. ఈ సినిమాలో మధ్య వయస్కుడైన బాక్సింగ్ కోచ్ పాత్రలో వెంకీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

More Related Stories