గద్దలకొండ గణేష్ హిట్ వాల్మీకి మహర్షికి అంకితం ఇచ్చిన డైరెక్టర్

‘గద్దలకొండ గణేష్ సినిమాతో దర్శకుడు హరీష్ శంకర్ మరో మాస్ మసాలా ఎంటర్టైనర్ను తెలుగు ప్రేక్షకులకి అందించారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం అనేక వివాదాల నడుమ ఈ శుక్రవారం నాడు థియేటర్స్‌లో విడుదలై మిశ్రమ స్పందనను రాబట్టింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా యూనిట్ నిన్న సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్న దర్శకుడు ఈ సినిమా విజయాన్ని 'వాల్మీకి మహర్షి' కి అంకితం ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మరో ఆరు గంటల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని టైటిల్ మార్చినా సరే మా సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లిన మీడియా వారికి ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు. మీడియాకి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా కోసం పని చేసిన వారిని పేరు పేరునా థాంక్స్ చెప్పుకొచ్చాడు హరీష్. సినిమా గొప్పతనం గురించి మాట్లాడాలంటే 1000 కి పైగా సినిమాల్లో నటించి, తెలుగు భాష మీద అమోఘమైన పట్టు ఉన్న బ్రహ్మనందం గారే కరెక్ట్ అనిపించిందని హరీష్ చెప్పుకొచ్చాడు. సినిమా వాళ్ళ కష్టాల గురించి ఆయన మాట్లాడారు కాబట్టే అంత మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు.
ఇక ఈ సినిమా అనుకున్నప్పటి నుండి తనతో ట్రావెల్ చేసిన మధు శ్రీనివాస్, మిధుల్ చైతన్య గారికి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు హరీష్. డైరెక్టర్‌గా అధర్వ అద్భుతంగా నటించాడని, ఈ సినిమా తరువాత తెలుగులో చాలా ఆఫర్స్ వస్తున్నాయని చెప్పుకొచ్చాడు. ఇక హీరోయిన్స్ ఇద్దరి గురించి, ఐటెం భామ గురించి కూడా చెప్పుకొచ్చాడు హరీష్. వరుణ్ని చాలా కన్విన్స్ చేసి టైటిల్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అని వేశామని వరుణ్ ఈ సినిమాలో ప్రాణం పెట్టి నటించాడని చెప్పుకొచ్చాడు. మిక్కీ పాటలు ఎంత హిట్ అయ్యాయో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతకన్నా హైలెట్ అయిందని హరీష్ పేర్కొన్నాడు. ఈ సినిమా 'వాల్మీకి' అనే టైటిల్‌తో మొదలయ్యింది. అందుకే ఈ సినిమా గణవిజయాన్ని 'వాల్మీకి మహర్షి'కి అంకితం ఇస్తున్నానని హరీష్ పేర్కోన్నారు.