English   

అప్పుడు మౌనంతో ఫ్లాప్.. ఇప్పుడు మాటలతో సూపర్ హిట్..

varun tej
2019-09-24 16:30:20

మౌనం, మాటలు ఏంటి అనుకుంటున్నారా.. ఇప్పుడు గద్దలకొండ గణేష్ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం గత వారం విడుదలైంది. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 18 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. తొలి రోజు యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు ఈ చిత్రం. వరుణ్, పూజ గతంలో ముకుంద సినిమాలో నటించారు. విచిత్రంగా ఆ సినిమాలో వీళ్ళిద్దరికి అసలు మాటలు ఉండవు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆ సినిమాను అలా ప్లాన్ చేసాడు. మాటలు లేకుండా అప్పుడు ఫ్లాప్ అందుకున్న ఈ జోడి ఇప్పుడు మాట్లాడుతూ సూపర్ హిట్ అందుకున్నారు. గద్దలకొండ గణేష్ సినిమాలో పూజా హెగ్డే పాత్ర కేవలం 15 నిముషాలు మాత్రమే ఉన్నా కూడా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ క్యారెక్టర్ సినిమా రేంజ్ పెంచేసింది. మరీ ముఖ్యంగా శ్రీదేవి పాత్రలో అద్భుతంగా నటించింది పూజా హెగ్డే. ఎల్లువొచ్చి గోదారమ్మ పాటలో కూడా అద్భుతమైన స్టెప్పులతో అభిమానులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అప్పుడు ఏమీ మాట్లాడకుండా ఫ్లాప్ ఇచ్చిన ఈ జంట.. ఇప్పుడు అన్ని మాట్లాడుతూ సూపర్ హిట్ కొట్టడం అభిమానులకు కూడా ఆనందాన్నిస్తుంది. అక్టోబర్ 2 వరకు ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర పోటీ లేకపోవడంతో గద్దలకొండ గణేష్ ఇంకా వసూళ్ల వర్షం కురిపించే అవకాశం కనిపిస్తోంది. కచ్చితంగా ఈ చిత్రం 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ లిస్టులో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

More Related Stories