English   

బాబు చంపేస్తాడంటున్న వర్మ

BABU CHAMPESTHADU
2019-09-24 17:32:48

సంచలనాల సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా 'బాబు చంపేస్తాడు' అనే పాటను ఈ సాయంత్రం విడుదల చేయబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా వర్మ నిన్ననే ప్రకటించాడు. ''బాబు చంపేస్తాడు' అనే పాటను ఈరోజు సాయంత్రం 4.37కి వీరబ్రహ్మ ముహూర్తంలో విడుదల చేయబోతున్నామని ఇంతకు ముందు చెప్పాను. కానీ ఇప్పుడు సాయంత్రం పరమ వీరబ్రహ్మ ముహూర్తమైన 4.59 గంటలకు విడుదల చేయబోతున్నామని ఈరోజు సవరణ కూడా ఇచ్చాడు. అన్నట్టుగానే రెండో సారి ప్రకటించిన సమయానికి వర్మ పాట రిలీజ్ చేశాడు. రిలీజ్ చేస్తూనే ఈ కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలోని పాత్రలు సన్నివేశాలు పూర్తి కల్పితమని పేర్కొన్నాడు. 

ఎవరి పేర్లు కానీ సందర్భాలు కానీ కలిసినా పూర్తి యాదృచ్చికమే అని గమనించాలి అని పేర్కొంటూ సాంగ్ విడుదల చేశారు. ఏయ్ ఎసేయ్యరా నా కొడుకుని అంటూ మొదలయిన ఈ సాంగ్ ని తర్వాత వర్మ వాయిస్ అందుకుంటుంది. ఇవాళ్టి రాజకీయ పరిస్థుతులను చూసి ఈ సినిమా తీస్తున్నట్టు వర్మ ప్రకటించాడు. రాజకీయ నాయకుల ఆత్మహత్యలు, అత్యంత మెజారిటీతో గెలిచిన ఇప్పటి ముఖ్యమంత్రిని టెర్రరిస్ట్ తో పోలుస్తున్న అప్పటి ముఖ్యమంత్రి, ఏమిటీ వైపరీత్యం ఎటు పోతోంది ఈ రాష్ట్రం. నిజానిజాలు ఏవైనా ఈ పరిస్థితులకి కారణం కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని చెప్పు కొచ్చాడు. ఈ పాట విని ఆనందించకుండా ఉండాలని కోరాడు. మరి ఈ పాటను మీరు కూడా వినేయ్యండి. 

More Related Stories