English   

కమెడియన్ వేణుమాదవ్ కి తీవ్ర అస్వస్థత

venu
2019-09-24 19:32:31

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ వేణుమాదవ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. కాప్రాలో నివాసం ఉండే ఆయనను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో జాయిన్ చేసినట్టు చెబుతున్నారు. గతంలో ఆయన ఆరోగ్యం గురించి రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయాల మీద ఆయన స్పందించారు కూడా. కానీ ఇప్పుడు నిజంగానే ఆయన ఆరోగ్యం సీరియస్ గా ఉందని చెబుతున్నారు. ఆయనకు వెంటిలేటర్ ద్వారా కృతిమ శ్వాస అందిస్తున్నారని అంటున్నారు. ఈ నెల 6న లివర్ సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన వేణుమాదవ్ కు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ మధ్యలో ఆయన ఆరోగ్య సమస్య తీవ్రం కావడంతో కిడ్నీలు రెండూ దెబ్బతిన్నాయని అంటున్నారు. దీంతో వేణుమాదవ్ ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉందని అంటున్నారు.

ఈవిషయం తెలుసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాజశేఖర్, నటుడు ఉత్తేజ్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని వేణుమాదవ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారని సమాచారం. అలాగే అక్కడే ఉన్న వేణుమాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారు దైర్యం చెప్పినట్టు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడలో జన్మించిన వేణుమాదవ్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఎన్టీఆర్ ద్రుష్టి లో పడి అక్కడ నుండి హాస్యనటుడిగా, కథానాయకుడిగా కూడా ఎదిగాడు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సంప్రదాయం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన వేణుమాదవ్ ఆ తర్వాత తొలిప్రేమ, దిల్, లక్ష్మి, సై, ఛత్రపతి లాంటి సినిమాల్లో చేసిన పాత్రలు ఆయనకి మంచిపేరు తీసుకొచ్చాయి. తర్వాత కాలంలో భూకైలాస్ లాంటి సినిమాల్లో ఆయన హీరో అవతారం కూడా ఎత్తారు. 

More Related Stories