English   

మరో మనోభావాల రచ్చ...ఈ సారి స్టార్ హీరో సినిమాకి

vijay
2019-09-25 06:52:30

ఈ మధ్య సినిమాలు తీసేవారికి ఏమి పెట్టి తీయాలన్నా కూడా భయమేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏం తీస్తే ఎవరి మనోభావాలు హర్ట్ అవుతాయో అని భయపడే రోజు రానే వచ్చేసింది. కొన్ని విషయాల్లో ఈ మనోభావాల విషయంలో నిజాయితీ ఉన్నా, కొన్ని చోట్ల మాత్రం కావాలని కలిపించుకుని మరీ వివాదాలు చేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన వాల్మీకి టైటిల్ వివాదం మర్చిపోక ముందే తమిళ టాప్ హీరో విజయ్ నటించిన బిగిల్ చిత్రానికి ఇప్పుడు ఒక వివాదం రాజుకుంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న `బిగిల్` త్వరలో రిలీజ్ కి రెడీ అయ్యింది. ఆ క్రమంలోనే ఈ చిత్రం పలు రకాల  వివాదాలకు తావిస్తోంది. తాజాగా ఈ సినిమా పోస్టర్ పై మాంసం వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు..

 తమ వృత్తికి కులదైవం లాంటి మాంసం కొట్టే దానిని కాలికింద పెట్టుకుని తమ మనోభావాలను దెబ్బ తీశారని వారు రచ్చకెక్కారు. తమ ప్రొఫెషన్ ని కించపరిచే విధంగా పోస్టర్ ను డిజైన్ చేశారు అని విమర్శలు చేసి రచ్చ రచ్చ చేశారు. మేం పొట్ట కూటి కోసం ఉపయోగించే కత్తిని విజయ్ తన కాళ్ల కింద పెట్టుకున్నాడు. మేం ఎంతో గౌరవంగా చూసుకొనే కత్తిని హత్యలు నేరాలు చేసినట్టు చూపడం సరైనదేనా అని వారు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆ పోస్టర్ తో ఉన్న బిగిల్ పోస్టర్లు చించి ఊరేగింపు చేశారు. తమిళనాడులోని ఉక్కడమ్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఈ మనోభావాల ఉద్యమానికి అన్నాడీఎంకే పార్టీ కూడా సపోర్ట్ చేస్తోంది. దీంతో పీఎస్ ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి శాంతింపజేయాల్సి వచ్చింది.

More Related Stories