English   

బిగ్ బీకి మరి అత్యున్నత పురస్కారం

amit
2019-09-25 07:49:02

బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ ను మరో అత్యున్నత పురస్కారం వరించింది. భారత ప్రభుత్వం మెగా స్టార్ కు దేశ సినిమా రంగంలోనే అత్యున్నత అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. జ్యూరీ ఈ అవార్డుకు అమితాబ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ ను ట్విట్టర్ ద్వారా ప్రకటించారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్. భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలు  కాదు ఒక అధ్యాయన్నే రాసుకున్నఅమితాబ్ బచ్చన్ 1942 అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్‌లోని  ప్రయాగ  జన్మించారు.

తండ్రి హరివంశరాయ్ బచ్చన్ కవి, అందుకే అమితాబ్‌కు మొదట ‘ఇంక్విలాబ్’ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత ‘ఎన్నటికీ ఆరని దీపం’ అని అర్ధం వచ్చేలా అమితాబ్ అని పేరు మార్చారు. ఆ పేరు బలమో లేక ఆయన పట్టుదలో కానీ వయసు పైబడుతున్నా ఆయన ఎక్కడా తగ్గకుండా నటిస్తూనే వున్నారు. ఇంటి పేరు శ్రీ వాత్సవను కాదని తండ్రి కలం పేరైన బచ్చన్‌ను ఇంటి పేరుగా మార్చుకున్నారు అమితాబ్. తన పాత్రలతో “యాంగ్రీ యంగ్ మాన్”గా గుర్తింపు చెందిన అయున షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బీ మెగా స్టార్ అనే బిరుదులను కూడా పొందారు. 

ఉత్తమ నటునిగా నాలుగు జాతీయ అవార్డులు, అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్, అవార్డ్ వేడుకల్లోనూ ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు అమితాబ్. నటునిగానే కాక, నేపధ్య గాయకునిగా, నిర్మాతగా, టెలివిజన్ యాంకర్ గానూ ఆయన తన ప్రతిభ చాటుకున్నారు. 1984లో భారత ప్రభుత్వం అమితాబ్ ను పద్మశ్రీతోనూ, 2001లో పద్మ భూషన్ తోనూ, 2015లో పద్మవిభూషన్ తోనూ గౌరవించింది. 2007లో ఫ్రెంచి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన “లెగియన్ ఆఫ్ హానర్”తో గౌరవించింది. ఈ యేడాదితో అమితాబ్ బచ్చన్ 50 ఏళ్ల నట జీవితాన్ని కంప్లీట్ చేసుకోవడం ఇదే ఏడాది ఆయనకు కేంద్రం ఈ అత్యున్నత పురస్కారం ప్రకటించడం కాకతాళీయమో ? యాదృచ్చికమో ?  

More Related Stories