English   

బిజినెస్ లోకి దిగిన త్రివిక్రమ్ శ్రీనివాస్

Trivikram.jpg
2019-09-25 09:09:47

త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ దర్శకుల జాబితాలో ఉన్న వ్యక్తి. కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా మాటల రచయితగా ప్రస్థానాన్ని ప్రారంభించి రచయితలకే ఒక రకమైన బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తీ ఆయన. సినిమాకు డైలాగ్స్ రాసి కోటి రూపాయలు పారితోషికం అందుకున్న మొదటి వ్యక్తి త్రివిక్రమ్ అంటే నమ్మక తప్పదు. చాలా మంది హీరోల కోసం సినిమాలకు వెళ్ళేవారు కానీ దర్శకుల కోసం సినిమాలు చూసే వారిసంఖ్య త్రివిక్రమ్ సినిమాల తర్వాత మొదలయ్యింది.

నిజానికి త్రివిక్రమ్ కు వ్యాపకాలు వ్యాపారాలు లాంటివి ఏమీ లేవు. కాని ఇటీవల రాజమండ్రి దగ్గరలోని రాజానగరంలో రాయుడు కాంప్లెక్స్ థియేటర్ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ డీల్ కొద్దినెలల క్రితమే జరిగినప్పటికీ బయటికి రాలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి హిట్ కావడంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

కమర్షియల్ సెంటర్ గా పేరున్న రాజమండ్రికి దగ్గరలో థియేటర్ చాలా మంచి ఆలోచనే అని అంటున్నారు విశ్లేషకులు.  గతంలో వివి వినాయక్, వైవిఎస్ చౌదరి లాంటి దర్శకులు ఇలాగే థియేటర్ లు కొని సక్సెస్ అయ్యారు. ఈ మధ్య మహేష్ బాబు ఏకంగా భారీ ఎత్తున థియేటర్ ప్రారంబించాడు. ప్రభాస్ కూడా తన స్నేహితులు యూవీ క్రియేషన్స్ వారితో కలిసి మొన్న సాహోకి పెద్ద థియేటర్ ఓపెన్ చేశాడు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ వంతు వచ్చిందన్న మాట.

More Related Stories