English   

చిన్న దేవరకొండ.... రెండో సినిమా హీరోయిన్ ఆమేనా

VijayDevarakondawithBrother.jpg
2019-09-25 09:49:24

సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌ లో స్టార్ హోదా అనుభవిస్తున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను నిజం చేస్తూ తన తమ్ముడిని కూడా హీరోను చేసుకున్నాడు. పైకి మాత్రం ఇదంతా వద్దని చెప్పానని చెబుతున్నా విజయ్ ప్రోత్సాహం ఉన్నట్టే కనిపిస్తోంది. అయితే ఎక్కడా తమ్ముడి సినిమాని ప్రమోట్ చేయని దేవరకొండ ప్రీ రిలీజ్ రోజు తమ్ముడి ప్రసంశల వర్షం కురిపించాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యింది, సినిమా కధాపరంగా మంచి పేరు వచ్చినా నటుడిగా ఆనంద్ దేవరకొండకి మంచి పేరు తేలేకపోయింది. 

ఈయన రెండో సినిమా గురించి రకరకాల ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాలు ఏవీ కన్ఫాం కాలేదు కానీ మరో కొత్త ప్రచారం మొదలయ్యింది. అదేంటంటే ఈయన రెండో సినిమా భవ్య క్రియేషన్స్ లో ఉండనుందని కూడా ప్రచారం జరిగింది. భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 12గా తెరకెక్కనున్న సినిమాలో ఆనంద్ హీరోగా ఎంపికయ్యాడని రచయితగా పలు సినిమాలకి పని చేసిన వినోద్ అనంతోజు అనే ఆయన ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా ఎంపిక చేశారని అంటున్నారు.

ఆనంద్ సరసన కథానాయికగా 96 చిత్రంలో ఫోటోగ్రాఫర్ పాత్ర పోషించిన వర్షా బొల్లమ్మను కథానాయికగా ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఇతరత్రా వివరాలు ఏవీ బయటకు రాకున్నా  నటీనటుల ఎంపిక సహా ప్రీప్రొడక్షన్ జరుగుతోందని అంటున్నారు. ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చూసీ చూడంగానే అనే సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. శేష సింధు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.

More Related Stories