దొరసాని అందాల ఆరబోత చూసారా...

హీరో రాజశేఖర్ కూతుళ్లు ఇద్దరూ ఇప్పుడు టాలీవుడ్ లో పాతుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే అందాల ఆరబోతకు కూడా తెర తీస్తున్నారు. ఇప్పటికే పెద్ద కూతురు శివానీ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ఔరా అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న కూతురు శివాత్మిక కూడా ఇదే చేస్తుంది. అక్క కంటే ముందే దొరసాని సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా దొరసానిలో చిన్న దొరసానిగా నటించింది ఈమె. ఈసినిమా ఫ్లాప్ అయినా కూడా శివాత్మిక నటనకు మంచి పేరు వచ్చింది. కాస్త ట్రై చేస్తే కచ్చితంగా టాలీవుడ్ లో ఈమెకు మంచిరోజులు వస్తాయని నమ్ముతున్నారు సన్నిహితులు కూడా.
ఇక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత గ్లామర్ ఒలకబోయకపోతే కష్టం. అందుకే ఇప్పుడు అందాల ముళ్లు విప్పేస్తుంది శివాత్మిక. పేరెంట్స్ స్టార్స్ అనేది కూడా పక్కనబెట్టి పూర్తిగా గ్లామర్ షోకు ఓపెన్ అయిపోయింది ఈ దొరసాని. మరి ఈమెకు ఇది అవకాశాలు తీసుకొస్తుందో లేదో చూడాలి.