English   

బాలీవుడ్ లో భారీగా... సైరా... అనబోతున్న మెగాస్టార్..

Sye Raa Narasimha Reddy Bollywood.jpg
2019-09-25 20:34:49

రంజీవి కెరీర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా. ఈ చిత్ర విడుదలకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సౌత్ లో నభూతో అనేలా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నాడు నిర్మాత రామ్ చరణ్. ఇక హిందీలో కూడా సైరాను భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 2న మరో భారీ సినిమా వార్ ప్రేక్షకుల ముందుకొస్తున్నా కూడా తన తెలివితేటలు వాడి.. సైరాకు సరిపోయే స్క్రీన్స్ తెచ్చుకుంటున్నాడు చరణ్. ఈ చిత్రాన్ని అక్కడ ఫర్హాన్ అక్తర్ తో పాటు అనిల్ తడాని విడుదల చేయబోతున్నారు. మరో వారం రోజులు మాత్రమే ఉండటంతో ఈ చిత్ర విడుదలకు సంబంధించిన పనులన్నీ వేగవంతం చేసాడు నిర్మాత చరణ్.

ముఖ్యంగా హిందీలో సైరా సినిమాను 1500 స్క్రీన్స్ లో విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 27న ముంబైలో భారీగా ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు అమితాబ్ బచ్చన్ కూడా రానున్నాడు. ఇక రామ్ చరణ్ ప్రమోషన్స్ అన్నీ చాలా ప్లాన్డ్ గా సిద్ధం చేస్తున్నాడు. హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మొదలైన ప్రమోషన్.. ఇప్పుడు చెన్నై.. బెంగళూరు.. కేరళ మీదుగా ముంబై వెళ్లనుంది. మొత్తానికి హిందీలోనూ సైరా భారీగా విడుదల కానుండటంతో అక్కడా కలెక్షన్లు భారీగానే వస్తాయని ఊహిస్తున్నారు దర్శక నిర్మాతలు.

More Related Stories