English   

వేణు మాధవ్ ఆస్తి ఎంతుందో తెలుసా.. కోట్లకు అధిపతి..

venu
2019-09-25 22:04:41

టాలీవుడ్ స్టార్ కమెడియన్ వేణు మాధవ్ మృతి అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. ఈయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. చికిత్స తీసుకుంటూ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించాడు. అయితే ఆయన చనిపోయిన కాసేపటికే మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వచ్చి వేణు మాధవ్ హాస్పిటల్ బిల్ కట్టడం అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఈయన బిల్ ఆయన కట్టడం ఏంటి.. వేణు మాధవ్ అంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడా అంటూ ఆరా తీసారు. అయితే అసలు విషయం మాత్రం అది కాదు. నిజానికి వేణు మాధవ్ కు మంచి ఆస్తులే ఉన్నాయి. ఆయన పీక్స్ లో ఉన్నపుడు డబ్బులు కూడా బాగానే కూడబెట్టాడు.

తన కుటుంబాన్ని కూడా ఆర్థికంగా బాగా సెట్ చేసాడు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తనకు ఎక్కడెక్కడ ఏయే ఆస్తులున్నాయో చెప్పుకొచ్చాడు వేణు. హైదరబాద్‌లోని ఈసీఐఎల్‌ నుంచి మౌలాలి వరకు తనకు పది ఇళ్లు ఉన్నాయని తెలిపాడు వేణు. అలానే కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ భూములు 10 ఎకరాల వరకు ఉంటాయని నిజాయితీగా చెప్పుకొచ్చాడు. తన పరిస్థితి.. తను ఎదిగిన వైనం కూడా తన కుటుంబ సభ్యులు చాలా నచ్చుతుందని.. అంతా ప్రస్తుతానికి హ్యాపీగా ఉందని చెప్పాడు వేణు మాధవ్. మొత్తానికి ఈయన ఆర్థిక పరిస్థితులపై వచ్చిన వార్తలకు దీంతో మూతపడుతుందనే అనుకోవాలి మరి.

More Related Stories