English   

రాక్షసుడు ఫైనల్ కలెక్షన్స్.. బెల్లంకొండ వారసుడికి తొలి హిట్.

movie
2019-09-25 22:35:50

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏం కోరుకోవడం లేదు.. ఒకే ఒక్క హిట్ కావాలంటున్నాడు. కానీ దేవుడు కరుణించడం లేదు. బ్లాక్ బస్టర్ టాక్ తో ఓపెన్ అయిన సినిమా కూడా ఇప్పుడు కలెక్షన్లు రావడం లేదు. దాన్ని బట్టి ఈ హీరో దురదృష్టాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో ఒక్క హిట్టు కొట్టాలని కలలు కంటున్న ఈ కుర్ర హీరో ఈ మధ్యే రాక్షసుడు సినిమాతో వచ్చాడు. థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రానికి తొలిరోజే టాక్ అద్భుతంగా వచ్చింది. దాంతో కచ్చితంగా బెల్లంకొండ సూపర్ హిట్ కొట్ఠడం ఖాయం అనుకున్నారంతా. కానీ ఫైనల్ కలెక్షన్స్ చూసిన తర్వాత హిట్ తో సరిపెట్టుకున్నాడు. 15 కోట్ల బ్రేక్ ఈవెన్ తో మొదలైన జర్నీ 15.36 కోట్లతో ముగిసింది. అంటే రాక్షసుడు సినిమా ఫుల్ రన్ లో 35 లక్షల లాభం తీసుకొచ్చింది. తొలి వారం తర్వాత స్లో అయిన విధానం చూసి కచ్చితంగా ఈ చిత్రం కూడా ఫ్లాప్ అవుతుందని అనుకున్నారు. అయితే ఇన్ని వారాలుగా ఎక్కడో ఓ చోట నడుస్తూనే చివరికి బ్రేక్ ఈవెన్ సాధించాడు బెల్లంకొండ. మొత్తానికి ఐదేళ్లుగా హిట్ కొట్టాలని తపిస్తున్న ఈ వారసుడికి తొలి విజయాన్ని ఇచ్చింది రాక్షసుడు. తమిళనాట విజయం సాధించిన రాచ్చసన్ సినిమాకు ఇది రీమేక్. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. 

More Related Stories