English   

సమంత ఫ్యూచర్ ప్లాన్ అదుర్స్.. పిల్లలు పుట్టిన తర్వాత..

Samantha Children.jpg
2019-09-26 07:09:16

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగచైతన్య, సమంత. గత కొన్నేళ్లలో వీళ్లున్నంత వార్తల్లో మరెవరూ లేరు. ఎప్పటికప్పుడు బ్రేకింగ్స్ లోనే కనిపిస్తుంటారు ఈ జోడీ. మరో నెల రోజులు అయితే ఈ జోడీ ఒక్కటై రెండేళ్లవుతుంది. 2017 అక్టోబర్‌ 7, 8 తేదీల్లో ఈ ఇద్దరూ గోవాలో ఒక్కటైపోయారు. ఈ ఇద్దరి ప్రేమ పెళ్లి అప్పట్లో సంచలనమే. ఇక పెళ్ళై రెండేళ్లు కావొస్తున్నా కూడా ఇప్పటికీ సమంత గుడ్ న్యూస్ మాత్రం చెప్పలేదు. ఇక ఇప్పుడు ఇదే ప్రశ్న సమంతకు కూడా ఎదురైంది. మంచు లక్ష్మీ షో ఫీట్ అప్ విత్ ది స్టార్స్ లో మీరు పిల్లలు ఎప్పుడు కంటారని నేరుగానే అడిగేసింది లక్ష్మి. దీనికి సమంత కూడా ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.

పిల్లలెప్పుడు కాకుండా.. మీకు పిల్లలు పుడితే సినిమాలకు బ్రేక్‌ ఇస్తావా అని సమంతను అడిగింది లక్ష్మీ. దీనికి సమంత అక్కినేని కూడా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. కచ్చితంగా కొన్ని రోజులు అయితే బ్రేక్‌ తీసుకుంటానని చెప్పింది.. అంతేకానీ ఫుల్ స్టాప్ మాత్రం పెట్టనంటుంది ఈ ముద్దుగుమ్మ. బ్రేక్ ఇచ్చి.. మళ్లీ సినిమాలు చేస్తానని కుండ బద్ధలు కొట్టేసింది సమంత. అయితే ఇప్పట్లో మాత్రం పిల్లలు ప్లాన్ చేయడం లేదని కూడా చెప్పింది సమంత. తమకు ఒకే బిడ్డ చాలంటుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి సమంత ఫ్యూచర్ ప్లాన్ మాత్రం అదిరిపోయింది.

More Related Stories